భారత సంతతికి చెందిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కి అరుదైన గౌరవం లభించింది. భారత్ ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ను ప్రధానం చేసింది. ఈ అవార్డును శుక్రవారం అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధూ సుందర్ పిచయ్ అందజేశారు. ఈ సందర్భంగా భారత్ పై తనకు ఉన్న భక్తి భావాన్ని ఆయన చాటుకున్నారు. తాను ఎక్కడి వెళ్లిన తన వెంట భారత్ ను తీసుకెళ్తానని సుందర్ పిచాయ్ అన్నారు. భారతదేశం తనలో ఒక భాగమని అన్నారు.
టెక్ దిగ్గజం గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కు 2022 సంవత్సరానికి గాను ట్రెడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మభూషణ్ అవార్డును భారత్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాదికి 17 మందికి ఈ రంగంలో అవార్డులు ప్రకటించగా అందులో సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు. భారతదేశ అత్యున్నత మూడో పురస్కారాన్ని సుందర్ పిచాయ్ తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో అందుకున్నారు. శుక్రవారం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధూ, సుందర్ పిచాయ్ కి ఈ అవార్డును అందజేశారు. ఈ అవార్డును అందించిన భారత ప్రభుత్వానికి , ప్రజలకు ఎప్పటికి రుణపడి ఉంటానని సుందర్ పిచాయ్ తెలిపారు. ఈ అవార్డుతో భారత దేశం తనను గౌరవిడంపై సంతోషం వ్యక్తం చేశారు.
భారతదేశం తనలోని భాగంగా ఉందని, ఎక్కడి వెళ్లినా ఇండియా తనతోనే ఉంటుందని ఆయన అన్నారు. తాను ఇంతటి స్థాయికి ఎదిగేందుకు మంచి అకాశాలను అందించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల గురించి ఇదే కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇండియాలో సాంకేతి మార్పులు వేగంగా జరుగుతున్నాయని పిచాయ్ తెలిపారు. ఇటీవల భారత్ ఆవిష్కరించిన డిజిటల్ చెల్లింపుల విధానం ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని సుందర్ పిచాయ్ అన్నారు. భారత్, గూగుల్ మధ్య భాగస్వామ్యం మరితంగా బలపడాని ఆయన ఆకాంక్షించారు. భారత దేశంలోనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా గతంలో ఎన్నడు లేనంతా వేగంగా ప్రజలు ఇంటర్నెట్ ను పొందుతున్నారని ఆయన అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ విజన్ ఇండియాలో సాంకేతికత వేగంగా పెరుగుతుందని ఆయన ప్రశంసించారు.
Delighted to hand over Padma Bhushan to CEO @Google & Alphabet @sundarpichai in San Francisco.
Sundar’s inspirational journey from #Madurai to Mountain View, strengthening 🇮🇳🇺🇸economic & tech. ties, reaffirms Indian talent’s contribution to global innovation pic.twitter.com/cDRL1aXiW6
— Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) December 2, 2022