బంగారు, వెండి ఆభరణాలు కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ సమాచారం మీ కోసమే. గత కొంత కాలంగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు బుధవారం నాడు స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ రెండు నెలల కనిష్టానికే ధరలు ఉండటం ఊరటనిచ్చే అంశం. బంగారం, వెండి ధరలుఎంత పెరిగాయంటే..?
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా మీ కోసమే ఈ అలర్ట్. గత కొంత కాలంగా తగ్గుతున్నవస్తున్న పసిడి ధరలకు కాస్త బ్రేక్ పడింది. బడ్జెట్ సమావేశాలకు ముందు భారీగా పెరిగి కంగారు పెట్టేసిన బంగారం, వెండి ధరలు.. ఆ తర్వాత నేల చూపులు చూస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆశావాహులు సైతం కొనుగోలు చూపేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొన్నటి వరకు వెలవెలబోయిన బంగారం దుకాణాలు సైతం ఈ ధరల తగ్గుదలతో జనాల రాకపోకలతో కిటకిటలాడుతున్నాయి. రెండు వారాలకు పైగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు బుధవారం నాడు కాస్త పెరిగాయి. అయినప్పటికీ రెండు నెలల కనిష్ట స్థాయిలోనే ధరలు ఉండటం ఊరటనిచ్చే అంశం.
అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడంతో భారత్‌లో కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1825 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే. ఢిల్లీలో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం గ్రాముపై రూ. 10 పెరిగింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం తులానికి రూ. 100 పెరిగింది. దీంతో రూ. 56,270కు ప్యూర్ గోల్డ్ చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.51, 600 వద్ద ఉంది. అలాగే హైదరాబాద్‌లో కూడా 10 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ప్రస్తుతం రూ.56,120 మార్క్ వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్లకు రూ.100 మేర పెరిగి ప్రస్తుతం రూ.51, 450 వద్దకు చేరింది.
బంగారం దారిలోనే వెండి నడుస్తోంది. గతంలో వెండి ధరలు తగ్గగా.. బుధవారం నాడు కిలో వెండిపై ఏకంగా రూ. 200 పెరిగింది. ఇక స్పాట్ సిల్వర్ ధర ప్రస్తుతం 20.88 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66, 800 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 200లు పెరిగి..రూ.69,200 వద్ద కొనసాగుతోంది. ఏపీలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మాత్రమే కాస్తా పెరిగినప్పటికీ గత కొంత కాలంగా ధరలు తగ్గుదలకు కారణం అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుండమే కారణం. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంచుతారన్న అంచనాలు నేపథ్యంలో బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. రెండు వారాల్లో బంగారం తులానికి ఏకంగా రూ.1400లకుపైగా తగ్గింది.కిలో వెండి రూ.1000 మేర తగ్గింది. దీంతో పసిడి ప్రియులు ఫుల్ ఖుషీ అయ్యారు.