బ్యాంకింగ్ రంగంలో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎప్పుడు, ఏం జరుగుతుందో అని మదుపర్లు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నో స్టార్టప్ కంపెనీలకు, టెక్ కంపెనీలకు ప్రాణం పోసిన ఓ బ్యాంక్ ఉన్నపళంగా మూతపడింది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు ఆ బ్యాంక్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. డిపాజిట్లు, బ్యాంకు ఆస్తుల మధ్య పొంతన లేకపోవడంతో నియంత్రణ సంస్థలు బ్యాంకును మూసివేయడంతో పాటు ఆస్తులను జప్తు చేశాయి.
బ్యాంకింగ్ రంగంలో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎప్పుడు, ఏం జరుగుతుందో అని మదుపర్లు తలలు పట్టుకుంటున్నారు. అమెరికాలోనే అతి పెద్ద బ్యాంకుగా చలామణి అయిన ‘సిలికాన్ వ్యాలీ బ్యాంక్’ ఉన్నపలంగా మూతపడింది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు ఆ బ్యాంక్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. డిపాజిట్లు, బ్యాంకు ఆస్తుల మధ్య పొంతన లేకపోవడంతో అమెరికా ప్రభుత్వ నిర్వహణలోని ‘ది ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ)’ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఆస్తులను స్వాధీనం చేసుకుంది. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్లలో సెషన్ల వ్యవధిలోనే బ్యాంకింగ్ రగం షేర్లు ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలాయి.
కాలిఫోర్నియా, శాంతాక్లారా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎస్‌వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ అనుబంధ సంస్థే ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్. అమెరికాలోనే 16వ అతిపెద్ద బ్యాంక్ ఇది. టెక్ ఆధారిత వెంచర్ క్యాపిటల్ ఫండ్‌లకు నిధులు అందించడం దీని ప్రత్యేకత. కాలిఫోర్నియా పరిధిలోని ఎన్నో స్టార్టప్ కంపెనీలకు, టెక్ కంపెనీలకు ఈ బ్యాంక్ ప్రాణం పోసింది. అంతే కాదు.. అమెరికాలో 44 శాతం టెక్, ఆరోగ్య సంరక్షణ కంపెనీలకూ ఇదే ఆధారం. అలాంటి బ్యాంక్ ఇటీవల కాలంలో ఎదురైన కొన్ని నష్టాలను పూడ్చుకునేందుకు, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు 21 బిలియన్ డాలర్ల సెక్యూరిటీలను విక్రయించినట్లు.. 2.25 బిలియన్ డాలర్ల వాటా విక్రయించనున్నట్లు గురువారం ప్రకటన చేసింది. ఇక్కడి నుంచి ఈ బ్యాంక్ పతనం ఆరంభమైంది.
What really happened at Silicon Valley Bank 🥸
🔊
Ht WSB u/narudatsu pic.twitter.com/bLApj4WhDc
— Wall Street Silver (@WallStreetSilv) March 10, 2023
భయపడ్డ పెట్టుబడి దారులు, వెంచర్ క్యాపిటలిస్టులు పెట్టుబడులను పరిమితం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో గంటల వ్యవధిలోనే అధిక మొత్తంలో బ్యాంకు డిపాజిట్లు ఉపసంహరణకు గురయ్యాయి. దీనికి తోడు మరికొన్ని వీసీ సంస్థలు, పోర్ట్‌ఫోలియో కంపెనీల వేరొక బ్యాంకుకు నగదు బదిలీ చేయమని తెలపడంతో డిపాజిట్లు మరింత క్షీణించాయి. ఈ సమస్యలకు తోడు సిల్వర్‌గేట్ క్యాపిటల్ కార్ప్ మూసివేత సంభవించడంతో, బ్యాంకింగ్ షేర్లు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్వహణలోని ‘ది ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ)’ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఆస్తులను జప్తు చేసింది.
ఎఫ్‌డీఐసీ, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఆస్తులను స్వాధీనం చేసుకున్నా.. వినియోగదారులందరికీ తమ డిపాజిట్లు లభిస్తాయా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎఫ్‌డీఐసీ నిబంధనల ప్రకారం.. 2.5 లక్షల డాలర్లు మాత్రమే డిపాజిటర్ల చెల్లింపులకు పూచీ ఉంటుంది. అంతకు మించిన డిపాజిట్ల చెల్లింపులకు ఎలాంటి హామీ ఉండదు. ప్రస్తుత సమాచారం ప్రకారం ఎస్‌వీబీ వద్ద ప్రస్తుతం 20,900 కోట్ల డాలర్ల డిపాజిట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం వెంచర్ క్యాపిటల్ (వీసీ) ఫండ్స్, స్టార్టప్ కంపెనీలవని సమాచారం. ఈ లెక్కన అధిక మొత్తంలో డిపాజిటర్లు తమ డిపాజిట్లు కోల్పోయే అవకాశం ఉంది. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో వాషింగ్టన్ మ్యూచువల్ పతనం తర్వాత ఇదే అతిపెద్ద బ్యాంకు వైఫల్యం కావడం గమనార్హం. ఇది అమెరికా బ్యాంకింగ్ రంగంలో మరో ఆర్థిక సంక్షోభానికి కారణమవుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
NEW: Massive line forms outside Silicon Valley Bank in California as customers panic.
Welcome to Biden’s America. It will only get worse.pic.twitter.com/MNCQuKIc9h
— Collin Rugg (@CollinRugg) March 10, 2023