చౌకగా ఇళ్లు లేదా భూమిని సొంతం చేసుకోవాలనుకునే వారికి శుభవార్త. సువర్ణవకాశం మీ ముందుకొచ్చింది. నవంబర్ 29న బ్యాంకులు 17444కు పైగా ఆస్తులను వేలం వేయబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకు పీఎన్‌ఏబీ ట్విట్టట్ ద్వారా సమాచారం ఇచ్చింది. వేలంలో ఇళ్లు మాత్రమే కాకుండా వాణిజ్యపరమైన ఆస్తులు, వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా పలు ఆస్తులున్నాయి. కావున కొనాలనే ఆలోచన ఉన్నవారికి ఇదో మంచి సువర్ణవకాశం అని చెప్పొచ్చు.
దేశంలోని బ్యాంకులన్నియు.. ఎప్పటికప్పుడు లోన్ చెల్లించని వారి ఆస్తులను వేలం వేస్తుంటాయి. వీటినే ఎన్‌పిఎల జాబితాలో చేర్చబడిన ఆస్తులు అంటారు. అంటే.. ఈ ఆస్తులపై రుణం తీసుకున్న వ్యక్తి దానిని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాడని, అతని నుండి రుణాన్ని తిరిగి పొందలేమని అర్థం. అటువంటి పరిస్థితిలో, బ్యాంకులు ఈ ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో చౌక ధరకే సొంతం చేసుకోవచ్చు. వేలంలో మొత్తం 12 బ్యాంకులు పాల్గొంటున్నాయి. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 34 రాష్ట్రాలలోని ఆస్తులను వేలం వేస్తున్నాయి. ఇందులో 13395 నివాస ఆస్తులు కాగా, 2583 వాణిజ్య ఆస్తులు, 1367 పారిశ్రామిక ఆస్తులు, 98 వ్యవసాయ భూములకు వేలం వేయనున్నారు. మీరు చౌకగా ఇల్లు లేదా భూమిని కొనుగోలు చేయాలనుకుంటే, ఇది మీకు మంచి అవకాశం. దీని గురించి మరింత సమాచారం కోసం, మీరు ibapi.in వెబ్ సైట్ ని సందర్శించవచ్చు.
ఇది ఇ-వేలం కాబట్టి మీరు ఆన్‌లైన్‌లో మాత్రమే ఇందులో పాల్గొనగలరు. ముందుగా ibapi.in ని సందర్శించండి. వేలానికి సంబంధించిన హోమ్ పేజ్ ఓపెన్ అయ్యాక.. BIDDERS REGISTRATION ట్యాబ్ పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇంతకుమునుందే మీకు లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్లయితే వాటితో లాగిన్ అవ్వొచ్చు. లేనియెడల Click here to Register అనే ఆప్షన్ ను ఎంచుకొని.. మీ ఈ-మెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ని నమోదు చేసుకోవాలి. మీరు వెబ్‌సైట్‌ను తెరిచిన వెంటనే పసుపు రంగులో వ్రాసిన మీకు కనిపిస్తుంది. దీని తర్వాత, KYCకి సంబంధించిన పత్రాలను సమర్పించాలి. వాటి వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ చలాన్ నింపబడుతుంది. అప్పుడే మీరు ఆన్‌లైన్‌లో బిడ్ చేయడానికి అర్హులవుతారు.
Mega E Auction offer mega opportunities!
Get set to bid for residential and commercial properties on https://t.co/N1l10rJGGS#MegaEauction #Auction pic.twitter.com/gqosZxfClW
— Punjab National Bank (@pnbindia) November 27, 2022