ఇటీవల ఆర్బీఐ రేపోరేట్లను పెంచిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల పెంపుతో పాటు పలురకాల డిపాజిట్లపైనా భారీగా వడ్డీ ఇస్తున్నాయి. తాజాగా ఓ ప్రైవేటు బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 8.01 శాతం మేర వార్షిక వడ్డీ ఇస్తోంది.
ఈ మధ్యకాలంలో బ్యాకింగ్ సేవలు బాగా పెరిగిపోయాయి. దాదాపు ప్రతి ఒక్కరు బ్యాకింగ్ సేవల గురించి తెలుసుకుంటున్నారు. అలానే బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లను బట్టీ ఆయా బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది బ్యాంకింగ్ కి సంబంధించిన న్యూస్ కోసం నిత్యం ఎదురు చూస్తుంటారు. అలానే బ్యాంకులు సైతం తరచూ వివిధ రకాల ప్రకటనలు చేస్తుంటాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు స్వల్పంగా వడ్డీ రేట్లు పెంచగా తాజాగా ఆ జాబితాలోకి యాక్సిస్ బ్యాంక్ చేరింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలోని ప్రముఖ ప్రైవేటు బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్ ఒకటి. తమ ఖాతాదారులకు అనేక రకాల సేవలు అందిస్తూ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా తమ కస్టమర్లకు యాక్సిస్ బ్యాంక్ శుభవార్త అందించింది. తమ బ్యాంకులో చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతూనే.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే పలు బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచగా.. తాజాగా యాక్సిస్ బ్యాంక్ కూడా ఆ జాబితాలో వచ్చి చేరింది. ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను గరిష్ఠంగా 8.01 శాతం వరకు పెంచుతున్నట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు. ఈ కొత్త రేట్లు ఫిబ్రవరి 11, 2023 నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది.
రూ.2 కోట్లు కన్నా తక్కవ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు పెంచిన ఈ వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. తాజా రేట్ల పెంపుతో యాక్సిస్ బ్యాంకు డిపాజిట్లపై 7 రోజుల నుంచి 10 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 3.5-7 శాతం మధ్య వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు 6 శాతం నుంచి 7.75 శాతం వడ్డీ అదించనుంది. ఇక రెండు కోట్ల లోపు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కాలపరిమితిని బట్టి వివిధ రకాలు గా ఉన్నాయి. అవి ఒక్కసారి పరిశీలించినట్లయితే.. 7-14 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.5 శాతం వడ్డీ ఇస్తోంది. వృద్ధులకు ఇదే రేటు వర్తిస్తోంది. 15-29 రోజులు, 30-45 రోజుల టెన్యూర్ కలిగిన డిపాజిట్లపై 3.5 శాతం వడ్డీ వర్తిస్తుంది. 46 రోజుల నుంచి 60 రోజుల టెన్యూర్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు, సీనియర్ సిటిజన్లకు 4 శాతం వడ్డీ వర్తిస్తోంది.
3-6 నెలల వరకు ఉన్న డిపాజిట్లపై సాధారణ ప్రజలతో పాటు సీనియర్ సిటిజన్లకు సైతం 4.75 వడ్డీ వర్తిస్తుంది. 6 నెలల నుంచి 9 నెలల మధ్యగల టెన్యూర్ డిపాజిట్లకు సాధారణ ప్రజలకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6 శాతం వడ్డీని యాక్సిస్ బ్యాంక్ ఇస్తోంది. ఇక 13 నెలల నుంచి 7 ఏళ్ల వరకు టెన్యూర్ కలిగిన డిపాజిట్లకు మాములు ప్రజలకు 6.75 శాతం, సీనియర్లకు 7.50 శాతం వడ్డీ వర్తిస్తోంది. అలానే 2 ఏళ్ల నుంచి 2.5 ఏళ్ల మధ్యలోపు సాధారణ ప్రజలకు 7.26 శాతం, సీనియర్ సిటీజన్లకు 8.01 శాతం వడ్డీ వర్తీస్తోంది. ఇంకా మరింత సమాచారం కోసం యాక్సిస్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు. మరి.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై యాక్సిస్ బ్యాంక్ పెంచిన వడ్డీ రేట్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.