ప్రస్తుతం అంతా ఆన్ లైన్ షాపింగ్ కోసం బాగా అలవాటు పడిపోయారు. గుండుసూది నుంచి నిత్యావసరాలు, గృహోపకరణాలు, గాడ్జెట్స్ ఇలా ఏది కావాలన్నా అంతా ఇ-కామర్స్ సైట్స్ లోనే కొనుగోలు చేస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్లుగా కొత్త కొత్త వెబ్‌సైట్స్ రావడం, ప్రముఖ ఇ-కామర్స్ సైట్స్ వాళ్లు భారీ డిస్కౌంట్స్ ప్రకటించడం చేస్తూనే ఉన్నారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ డేని ప్రకటించింది.
జులై 23- 24 తేదీల్లో అమెజాన్ లో అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. కిచెన్ వేర్, గాడ్జెట్స్, మొబైల్స్, దుస్తులు, ఫుట్ వేర్ ఇలా ప్రతి దానిపై డిస్కౌంట్స్ ప్రకటించింది. ఆ రెండు రోజులు అమెజాన్ లో దాదాపు అని వస్తువులపై డిస్కౌంట్స్ ఉండేలా ప్లాన్ చేశారు. అయితే ఏ వస్తువుపై ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి? ఎంతెంత డిస్కౌంట్స్ లభిస్తున్నాయో ఈ ఆర్టికల్ లో పూర్తి వివరాలుతెలుసుకోండి.
ల్యాప్‌టాప్స్, హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ వంటి గాడ్జెట్స్ పై 75 శాతం వరకు తగ్గింపు ధరలను ప్రకటించింది. ల్యాప్ టాప్స్ పై గరిష్టంగా రూ.40 వేల వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. టాబ్లెట్స్ పై 50 శాతం వరకు తగ్గింపు, స్మార్ట్ వాచెస్ పై 75 శాతం వరకు తగ్గింపు, హెడ్ ఫోన్స్- స్పీకర్స్ పై 75 శాతం వరకు డిస్కౌంట్స్ ప్రకటించింది. కెమెరాలపై 70 శాతం, అలెక్సా డివైజెస్ పై 55 శాతం వరకు డిస్కౌంట్స్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
మొబైల్ ఫోన్స్ వాటి యాక్ససరీస్ పై అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రకటించింది. రెండ్రోజుల పాటు అమెజాన్ లో మొబైల్ ఫోన్స్ వాటి యాక్ససరీస్ పై 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తాయంటూ ప్రకటించింది. ఐఫోన్ మొదలు, వన్ ప్లస్, రెడ్ మీ, రియల్ మీ, ఐకూ, శాంసంగ్, ఒప్పో, వివో వంటి బ్రాండెడ్ మొబైల్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, మొబైల్ హోల్టర్స్, కేబుల్స్, ఛార్జర్స్, పవర్ బ్యాంక్స్, స్క్రీన్ ప్రొటెక్టర్స్ ఇలా అన్నింటిపై 40 శాతం వరకు డిస్కౌంట్స్ ఇవ్వనున్నారు.
మీ జీవనాన్ని సులభతరం చేసేందుకు వంటగదిలో, ఇంట్లో ఉపయోగించే గృహోపకరణాలపై అమెజాన్ ప్రైమ్ డే రోజు 70 శాతం వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. కిచెన్ హోం అప్లైన్సెస్ పై 70 శాతం వరకు, హోమ్ డెకార్ వస్తువులపై 70 శాతం వరకు, మ్యాట్రసెస్స్, ఫర్నీచర్ పై గరిష్టంగా 80 శాతం వరకు తగ్గింపు ధరలు ప్రకటించింది.
టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్, డిష్ వాషర్, ఏసీ వంటి వస్తువులపై గరిష్టంగా 60 శాతం వరకు డిస్కౌంట్స్ ప్రకటించింది. అది కూడా ఐఎఫ్‌బీ, హాయర్, శాంసంగ్, సోనీ, తొషిబా వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై డిస్కౌంట్స్ అందిస్తోంది. అంతేకాకుండా ఎక్స్ ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది. మీ ఇంట్లోని పాత వస్తువులను ఎక్స్ ఛేంజ్ చేసుకుని కొత్తవి తీసుకోవచ్చు.
ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్ అనేది జులై 23, 24 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ ప్రైమ్ డే సేల్ ని కేవలం ప్రైమ్ యూజర్ల కోసం మాత్రమే అంటూ అమెజాన్ సంస్థ ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం అమెజాన్ అధికారిక వెబ్ సైట్ ని సందర్శించండి. అమెజాన్ ప్రకటించిన డిస్కౌంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.