బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రెండోవారం కూడా ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. విదేశాల నుంచి అందిపుచ్చుకున్న ఈ రియాలిటీ షో కాన్సెప్ట్ భారతదేశంలో కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. వచ్చిన అన్ని భాషల్లో దూసుకుపోతోంది. నిజానికి అన్ని భాషల్లో కంటే తెలుగులో ఈ షో సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పటికే ఐదు సీజన్లు, ఓటీటీ పూర్తి చేసుకుని ఆరో సీజన్ నడుస్తోంది. గతంలో లాగే ఈ సీజన్లో కూడా ఒక రియల్ కపుల్‌ని బిగ్ బాస్ నిర్వాహకులు పంపారు. టీవీ సీరియల్ ఆర్టిస్టులు రోహిత్ సాహ్నీ- మరీనా అబ్రహాం ఇద్దరూ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో రియల్ కపుల్‌గా అడుగుపెట్టారు. వీళ్లకి వరుణ్ సందేశ్- వితికా షేరీ అంత క్రేజ్ రాలేదనే చెప్పాలి.
హౌస్‌లో వీళ్లు వెళ్లిన దగ్గరి నుంచి రోహిత్ ఏమో కెమెరాలు ఉన్నాయంటూ ఆమెకు దూరంగా ఉంటూ వచ్చాడు. మరీనా మాత్రం నాకు గుడ్ మార్నింగ్ హగ్ ఇవ్వలేదు, నాకు టైమ్ ఇవ్వడం లేదంటూ గొడవ పెడుతూ ఉండేది. అక్కడితో ఆగకుండా హౌస్‌లో ఉన్న అమ్మాయిలను కూర్చోబెట్టుకోని నా మొగుడు నన్ను పట్టించుకోవడం లేదంటూ గొడవ చేసింది. వాళ్లేమో హగ్ ఇవ్వు, మూలకు తీసుకెళ్లి ముద్దు పెట్టు అంటూ గలీజ్ సలహాలు అన్నీ ఇచ్చారు. అక్కడితో ఆ సీన్ అయిపోయింది అనుకుంటే తర్వాతి రోజు కూడా అలాంటి సీనే మళ్లీ రిపీట్ అయ్యింది. మరోసారి అందరి ముందు రోహిత్ నన్ను పట్టించుకోవడం లేదు. నిన్న రాత్రి దుప్పటిలో చేయి పట్టుకున్నాడు.. వెంటనే నిద్రపోయాడు అంటూ సిగ్గు విడిచి ప్రచారాలు చేసింది.
సరేలే కొత్తగా హౌస్‌లోకి అడుగుపెట్టారు అలవాటు పడాలి కదా అంటూ అంతా అనుకున్నారు. కానీ, తర్వాత శ్రీసత్యతో కలిసి వాళ్లు ఒక ప్రాంక్ చేశారు. శ్రీ సత్య నా మొగుడిని నాతో మాట్లాడనివ్వడం లేదంటూ గొడవ చేశారు. ఆ తర్వాత ఇట్స్ ఏ ప్రాంక్ అంటూ ఎటు వాళ్లు అటు వెళ్లిపోయారు. నాగార్జున వచ్చిన తర్వాత వీకెండ్ ఎపిసోడ్లో వీళ్లకు క్లాస్ పీకుతారని సగటు తెలుగు ప్రేక్షకులు భావించారు. కానీ, అక్కడ అలాంటి సీన్ ఏం జరగలేదు. ఇంకా నాగార్జునానే ఆమెకు టైట్ హగ్ ఇవ్వు అంటూ ఆర్డర్ పాస్ చేశారు. ఇంక రోహిత్ కూడా తన భార్యకు ఒక హగ్ ఇచ్చి కాంప్లిమెంటరీ కింద ముద్దు కూడా పెట్టాడు. అయితే రోహిత్ ప్రవర్తనలో కూడా అప్పటి నుంచి మార్పు కనిపించడం మొదలైంది.
మరీనా చుట్టూ తిరగడం, ఆమెకు ముద్దులు పెట్టడం చేస్తున్నాడు. తాజాగా రోహిత్ మరీనాకు ముద్దు పెడుతుంటే నేహా చౌదరి చూస్తుంది. మాకు ప్రైవసీ లేదా అంటూ మరీనా మాట్లాడటమే కాకుండా నవ్వుతూ.. నువ్వు కూడా త్వరగా పెళ్లి చేసుకో అంటూ సలహా కూడా ఇస్తారు. అందుకు నేహా చౌదరి అన్ని మాట్రిమోనీ సైట్లలో నా ప్రొఫైల్ ఉంది అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు వీళ్ల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. మొన్నటి దాకా మరీనాను తిట్టుకున్న వాళ్లు ఇప్పుడు రోహిత్ ని కూడా కలిపి తిడుతున్నారు. ఎక్కడ ఉన్నాం? ఎవరు చూస్తున్నారు? మనం ఎలా ప్రవర్తించాలి? అనే విచక్షణ ఉండక్కర్లేదా అంటూ మండిపడుతున్నారు. తెలుగు ప్రేక్షకులు చూసే షోలో ఇలా ముద్దులు, హద్దులు దాటి రొమాన్స్ ఏంటని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. కొందరు అయితే కంటెంట్ క్రియేట్ చేయడం కోసమే ఇలా చేస్తున్నారంటూ చెప్పుకొస్తున్నారు. మరి.. రోహిత్- మరీనా ప్రవర్తనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.