బిగ్ బాస్ 6వ సీజన్ ఎంతో సరద సరదాగా సాగింది. కానీ రెండో వారం మాత్రం షాకింగ్ టర్న్ తీసుకుంది. ఏకంగా ఇద్దరినీ ఎలిమినేట్ చేసేశారు. దీనికి తోడు హోస్ట్ నాగార్జున.. హౌస్ మేట్స్ ని వాదులాడుకోమని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చేశాడు. దీంతో రాబోయే ఎపిసోడ్స్ యమ క్రేజీగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇక ఎలిమినేట్ అయిన సమయంలో అభినయ తెగ ఎమోషనల్ అయింది. తన విషయంలో అలా జరగడం బాధకలిగించిందని చెప్పింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ ప్రస్తుత సీజన్ లో మొత్తం 21 మంది హౌసులో అడుగుపెట్టారు. వారిలో గీతూ, రేవంత్ లాంటి వాళ్లు గొడవలు పడుతూ, ప్రతి చిన్న విషయంలో రచ్చ చేస్తూ ప్రోమోల్లో కనిపించారు. ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్ లోనూ హైలెట్ అయ్యారు. ట్విస్ట్ ఏంటంటే.. వీళ్లు నామినేషన్స్ లోనూ ఉన్నారు కానీ సేవ్ అయిపోయారు. షానీ, అభినయ శ్రీ.. ఈసారి ఎలిమినేట్ అయిపోయారు. ఈ క్రమంలో ఎమోషనల్ అయిన ఆమె.. ఇంత తర్వగా తనని బయటకు పంపిచేస్తారనుకోలేదని వాపోయింది.
ఇక అభినయ ఎలిమినేట్ అయిపోవడానికి కారణాలు చూసుకుంటే.. మొదటిది ఆమె హౌసులో అంత యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించలేదు. మంచిగా ఉంటూ అలా అలా కంటిన్యూ అవుతాననుకుంటే బిగ్ బాస్ హౌసులో నడవదు. కాబట్టి వీలైనంత గొడవలు పడాలి, సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ మనమే కావాలి. ఈ విషయంలో అభినయ ఆసక్తి చూపించలేదు. ఇక ఫిజికల్ టాస్కుల్లోనూ పాల్గొంది కానీ అంతగా ఫెర్ఫామెన్స్ ఇవ్వలేదు. షో చూస్తున్న ప్రేక్షకుల మైండ్ లో రిజిస్టర్ కావాలంటే.. ఏదైనా సెన్సేషన్ క్రియేట్ చేసి షోలో హైప్ తెచ్చుకోవాలి. కానీ అలా జరగకపోవడం కూడా అభినయ ఎలిమినేట్ కావడానికి కారణం అని చెప్పొచ్చు.
ఇక ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ కేఫ్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన అభినయ.. చూసిన వెంటనే గొడవపడాలి, చూసిన వెంటనే ఏడవాలి అంటే తనకు కుదరదని.. రియల్ లైఫ్ తను అలా కాదని చెప్పింది. రేవంత్.. స్టార్టింగ్ నుంచి ఫేక్ గా అనిపించాడని.. అందుకే డిస్ హానెస్ట్ అనేది అతడికి ఇచ్చానని వెల్లడించింది. అలానే హౌసులో గుంటనక్క ఎవరన్నా సరే తడుముకోకుండా రేవంత్ పేరునే అభినయ చెప్పింది. దీన్నిబట్టి చూస్తుంటే అభినయ ఎలిమినేట్ కావడం ఏమో కానీ రేవంత్ పై తనకు ఎంతకోపం ఉందో ఇంటర్వ్యూలో బయటపెట్టేసింది. మరి అభినయ ఎలిమినేట్ కావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: రేటింగ్ తగ్గడంతో రూట్ మార్చిన బిగ్ బాస్! కొట్టేసు కోమని నేరుగానే చెప్తున్నారు!