ఎట్టకేలకు ఎన్నో మలుపులు, ట్విస్టుల మధ్య బిగ్ బాస్ రియాలిటీ షో 6వ సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ గా పాల్గొన్న ఈ 6వ సీజన్ లో.. సింగర్ రేవంత్ టైటిల్ విన్నర్ కాగా.. శ్రీహన్ రన్నరప్ గా నిలిచాడు. ఇక మూడు, నాలుగు, ఐదు స్థానాలను కీర్తి భట్, ఆదిరెడ్డి, రోహిత్ చేరుకున్నారు. ఇటీవల డిసెంబర్ 18న జరిగిన గ్రాండ్ ఫినాలేతో బిగ్ బాస్ సీజన్ 6 ముగిసింది. దీంతో విన్నర్, రన్నర్ లతో పాటు టాప్ 5లో నిలిచిన కీర్తి భట్, ఆదిరెడ్డి, రోహిత్.. ఇలా ఒక్కొక్కరు ఎంతెంత గెలిచారు? ఎవరికి బిగ్ బాస్ ప్లస్ అయ్యింది? మరి కామన్ మ్యాన్ కేటగిరీలో వెళ్లిన ఆదిరెడ్డి ఎంత గెలిచాడు? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వివరాలు ఆరా తీసే పనిలో ఉన్నారు జనాలు.
ఇక రివ్యూయర్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన ఆదిరెడ్డి జర్నీ ఎంతో ఆసక్తికరంగా సాగింది. అయితే.. బిగ్ బాస్ టైటిల్ ప్రైజ్ మనీనే రూ. 50 లక్షలు కాగా.. అందులో రూ. 40 లక్షలు శ్రీహన్ కి వెళ్లడంతో మిగిలిన రూ. 10 లక్షలు విన్నర్ రేవంత్ కి వెళ్తుందని షాకిచ్చారు. కానీ.. బిగ్ బాస్ విన్నింగ్ ట్రోఫీతో పాటు రేవంత్ కి సువర్ణభూమి వారి నుండి 650 గజాల ఫ్లాట్, ఒక బ్రెజా కారుతో పాటు అదనంగా కొన్ని వారాల రెమ్యూనరేషన్ ని అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఫినాలేలో రన్నర్ గా నిలిచిన శ్రీహన్.. ప్రైజ్ మనీలో నుండి రూ. 40 లక్షలు తీసుకోవడానికి కారణం ఏంటనే ప్రశ్న అందరిలో మొదలైంది. దీనికి శ్రీహన్ కారణం వేరే అయ్యుండొచ్చు. కానీ.. ఇదే విషయంపై టాప్ 4 కంటెస్టెంట్ ఆదిరెడ్డి తన అభిప్రాయాన్ని తాజాగా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు.
‘చాలామంది మీరు కూడా అమౌంట్ పట్టుకొని బయటికి వస్తారేమో అనుకున్నారు?’ అని అడగ్గా.. ఆదిరెడ్డి స్పందిస్తూ.. ‘నేను ఎప్పుడు కూడా మాటమీదే ఉంటాను. కోటి రూపాయలు ఇచ్చినా తీసుకోను. ఎందుకంటే.. ముందే చెప్పారు అది విన్నింగ్ ప్రైజ్ మనీ అని. ఒకవేళ నేను రెండో మూడో స్థానంలో ఉండి.. నాకు డబ్బులు ఆఫర్ చేసినప్పుడు తీసుకున్నానంటే అక్కడ విన్నర్ కి అన్యాయం జరిగినట్లే. కానీ.. వాళ్ళ ఫైనాన్సియల్ పొజిషన్ బట్టి కొంతమంది అలా చేయొచ్చు. ఇప్పుడు శ్రీహన్ చేసింది కరెక్టే. అతను కష్టపడి రెండో స్థానానికి వచ్చాడు. ఫైనాన్సియల్ గా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కొన్నిసార్లు చెప్పాడు. అలాంటప్పుడు తీసుకోవాలని అనిపిస్తుంది.. తీసుకున్నాడు తప్పులేదు. కానీ.. ఆ స్థానంలో నేనుంటే తీసుకునేవాడ్ని కాదు. ఇది నా అభిప్రాయం’ అని చెప్పాడు. ప్రస్తుతం శ్రీహన్ గురించి ఆదిరెడ్డి చెప్పిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఆదిరెడ్డి మాటలపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.