‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ముగిసింది. వీజే సన్నీ బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ టైటిల్ విన్నర్ గా అవతరించాడు. అందరూ ఊహించిన విధంగానే సన్నీ విజేతగా నిలిచాడు. రెండో స్థానంలో షణ్ముఖ్ జశ్వంత్ నిలిచాడు. రన్నరప్ షణ్ముఖ్ పై ప్రస్తుతం ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఇంతక ముందు సిరితో రిలేషన్ పై ట్రోల్ చేసేవాళ్లు. ఇప్పుడు వారికి మరో అంశం దొరికింది. దానిపై కూడా విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అదే రన్నరప్ స్పీచ్ విషయంలో. నాగార్జున రన్నరప్ స్పీచ్ కావాలంటూ కోరాడు. అప్పుడు షణ్ముఖ్ మాట్లాడిన మాటలే తనపై బ్యాక్ ఫైర్ అయినట్లుగా కనిపిస్తోంది.
‘పర్లేదు, ఏం పర్లేదు.. టైటిల్ విన్నవ్వడం ముఖ్యం. మనం ఎలా ఆడాము అన్నదే ఇంపార్టెంట్. అమ్మానాన్నను ఇక్కడి దాకా తీసుకురాగలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది’ అంటూ షణ్ముఖ్ స్పందించాడు. ఇప్పుడు ఆ మాటలే అతనిపై నెట్టింట ట్రోల్స్ పడేలా చేస్తున్నాయి. విన్నింగ్ ముఖ్యం కాకపోతే ఇంతకాలం ఎందుకు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నావ్? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎలా ఆడామో ముఖ్యం అన్నది కరెక్టే.. నువ్వు బాగా ఆడలేదు కాబట్టే కదా రన్నరప్ ఇచ్చింది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. షణ్ముఖ్ అభిమానులు మాత్రం ‘పాల నుంచి వచ్చేది జున్ను.. బిగ్ బాస్ లో హీరో మా షణ్ను’ అంటూ నెట్టింట్ హల్ చల్ చేస్తున్నారు. షణ్మఖ్ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.