తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 విజేత విన్నర్ ఎవరో తెలిసిపోయింది. వీజే సన్నీ బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా నిలిచాడు. దీంతో.. ఇప్పుడు సన్నీ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. అయితే.., ఇప్పుడు సన్నీ పెద్ద స్టార్ కావచ్చు. కానీ.., అతను ప్రస్థానం మాత్రం చాలా కష్ట, నష్టాల మధ్య సాగింది. ఇంతకీ అసలు ఎవరీ VJ సన్నీ? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: తీవ్ర నిరాశలో షణ్ముక్ ఫ్యాన్స్! సిరి కొంప ముంచిందా?
మోడల్ గా తన కెరీర్ ని మొదలు పెట్టాడు సన్నీ. ఆ తరువాత వీజేగా చాలా ఏళ్ళు కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా నడిపించాడు. ఆ తరువాత యాంకర్ గా కూడా కొన్ని షోలలో మెరిశాడు. ఇలా వచ్చిన ఫేమ్ తోనే సన్నీకి సీరియల్స్ లో అవకాశం లభించింది. అయితే.., “కళ్యాణ వైభోగమే” సీరియల్ తో మంచి పేరు రావడంతో వీజే సన్నీ కాస్త.. ఆర్టిస్ట్ సన్నీగా గుర్తింపు పొందాడు. సన్నీకి లేడీ ఫ్యాన్స్ ఎక్కువ. ఇతనికి బుల్లితెర జూనియర్ ఎన్టీఆర్ అని పేరు. ఇక “సకలగుణాభిరామ” అనే సినిమాలో సన్నీ నటించాడు. ఇలా వచ్చిన ఫేమ్ కారణంగానే సన్నీకి బిగ్ బాస్ ఆఫర్ లభించింది.
ఇది కూడా చదవండి: బిగ్ బాస్ టైటిల్ కోల్పోయిన షణ్ముఖ్! దీప్తి సునైనా కన్నీటి పోస్ట్!ఇక బిగ్ బాస్ హౌస్ లో వీజే సన్నీ ప్రయాణం వివాదాలతో, కామెడీ, ఎమోషన్స్ తో సాగింది. హౌస్ లో మొదటి నుంచి సన్నీ ఎవరితోనూ అతి స్నేహంగానీ, అతి విరోధం గాని పెంచుకోలేదు. ఏ విషయంపైన అయిన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేవాడు సన్నీ. టాస్క్ ల విషయంలోనూ సన్నీ సీరియస్ గా ఆడేవాడు. తన మాటలతో బిగ్ బాస్ హౌస్ లో నవ్వుల పువ్వులు పూయించేవాడు. “అది కాదు మచ్చా” అంటూ ప్రతి ఒకరితో కామెడీ చేసే వాడు. హౌస్ లో తన పై ఎవరైనా కామెంట్స్ చేస్తే గొడవపెట్టుకునేవాడు. కొద్ది సేపటికి వారిని మళ్ళీ తనే వెళ్లి పలకరించేవాడు. ఇలాంటి స్వభావంతో సన్నీ హౌస్ మెట్స్ నే కాకుండా హౌస్ బయట ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్నాడు. పైగా.., సన్నీకి స్నేహం కోసం ప్రాణం ఇస్తాడు. ఏదైనా మొహం మీదే చెప్పేస్తాడు గాని, కుట్రలు చేయడం, దొంగదెబ్బ తీయడం అస్సలు సన్నీకి తెలియవు. ఈ జెన్యూనిటీనే సన్నీని ఇప్పుడు బిగ్ బాస్ విజేతగా నిలబెట్టింది. మరి.. చూశారు కదా? ఇది సన్నీ ప్రస్థానం. సన్నీ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sunny 👑
Legend of #BiggBossTelugu5#VJSunny🏆 pic.twitter.com/o8ZW08nQ94— Lee Hasoo (@adotjust007) December 18, 2021