బిగ్ బాస్‌లో నామినేషన్ల ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగనుంది. ఈ సందర్భంగా ప్రియా వ్యాఖ్యలపై ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. నిన్నటి బిగ్ బాస్ హౌస్‌లో పెద్ద రణరంగమే జరిగింది.. సోమవారం రాత్రి ప్రసారమైన ఎపిసోడ్‌లో ప్రియా.. లహరీని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. లేట్ నైట్.. వాష్ రూమ్‌లో రవి, లహరి హగ్ చేసుకున్నారని నామినేషన్లు సందర్భంగా ఆరోపించింది. నేషనల్ టెలివిజన్‌లో ఒకరి క్యారెక్టర్ దెబ్బతినేలా అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ లహరి మండిపడింది. తనకు ఫ్యామిలీ ఉందని, ఇలాంటి వ్యాఖ్యల వల్ల బయటకు తప్పుడు మెసేజ్ వెళ్తుందని రవి అసహనం వ్యక్తం చేశాడు. అయితే ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అనే దానిపై హాట్ డిస్కషన్ నడుస్తుంది.. దీనికి సంబంధించి ప్రోమో విడుదల చేశారు.
ప్రియ, లహరి, రవి ఒక చోట కూర్చొని జరిగిన విషయం మీద చర్చించడం కనిపించింది. ఈ సందర్భంగా ‘సింగిల్ మెన్’, ‘మ్యారీడ్ మెన్’ వ్యాఖ్యల గురించి లహరి.. రవిని ప్రశ్నించింది. అయితే, తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని రవి చెప్పడం కనిపించింది. ‘‘నువ్వు అన్నావ్’’ అని ప్రియా వాదించింది. నన్ను బ్యాడ్ చేయడానికి ఆమె ఇలా చెప్తుందని రవి అంటుంటే.. ‘నేను చూసిందే మాట్లాడాను.. నేనేమి కల్పించి మాట్లాడలేదు.. విన్నదే వాళ్లదగ్గర చెప్పాను’ అని ప్రియ కన్నీళ్లు పెట్టుకుంటున్న ప్రోమోను రిలీజ్ చేశారు. మొత్తానికి ఎప్పుడూ కూల్‌గా కనిపించే ప్రియా.. ఈ గొడవ వల్ల డీలా పడినట్లు కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే సోమవారం ఎపిసోడ్ లో లహరి – ప్రియాను నామినేట్ చేస్తూ.. అసలు మీరెందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో.. నాకు అర్ధం కావట్లేదు’ అని లహరి అనగా.. ‘ఎందుకంటే నువ్ హౌస్ లో ఉన్న మగాళ్లతో నువ్ చాలా బిజీగా ఉంటున్నావ్ అనడంతో ఎవరితోనో చెబుతారా అని అడిగింది లహరి. వెంటనే ప్రియ ‘రవి గారితో బిజీగా ఉన్నావ్.. మానస్ తో బిజీగా ఉన్నావ్..’ అని ఆన్సర్ చేసింది. ఆ తరువాత ‘నీకు మగాళ్లతో ఎలాంటి సమస్యలు రావని.. విమెన్ తో మాత్రమే సమస్యలుంటాయని’ ప్రియా షాకింగ్ కామెంట్స్ చేసింది. దాంతో రవి, లహరి ఇద్దరూ ప్రియాపై మండిపడ్డారు.
Evaru jarigindi chepparu? Evaru kalpinchi chepparu?#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/PoUvN2es1U
— starmaa (@StarMaa) September 21, 2021