బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న సోషల్ మీడియా స్టార్స్ లో అలేఖ్య హారిక అలియాస్ దేత్తడి హారిక ఒకరు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ చేస్తూ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ దక్కించుకున్న హారిక.. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని టీవీ ప్రేక్షకుల ఫాలోయింగ్ సైతం సొంతం చేసుకుంది. బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచి.. తన పేరులోని దేత్తడి ట్యాగ్ ని కాపాడుకుంది.
ఇక హారిక బయటికి వచ్చాక మళ్లీ యూట్యూబ్ లో, అడపాదడపా సినిమాల్లోను నటిస్తోంది. అయితే.. సోషల్ మీడియా స్టార్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నాక.. అభిమానించే ఫ్యాన్స్ తో పాటు ట్రోల్ చేసేవారు కూడా ఉంటారు. తాజాగా హారిక కూడా తన హైట్ విషయంలో ట్రోల్స్ కి గురైంది. కానీ ట్రోల్స్ కి బెదరకుండా.. ట్రోల్ చేసేవారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. డిఫరెంట్ ఆటిట్యూడ్ తో హారిక బిగ్ బాస్ లో ఎక్కువగా షార్ట్స్, చెడ్డిలు ధరించి యూత్ ని ఆకట్టుకుంది.గ్లామర్ పరంగా పర్లేదు అనిపించినా.. సినిమాల్లో మాత్రం రాణించలేకపోతుంది హారిక. అయితే.. ఆమెకు సినిమా అవకాశాలు రాకపోవడానికి ఓ కారణం ఆమె హైట్.. అంటూ తరచూ అదే విషయం పై నెటిజన్లు హారికను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ డైలాగ్ తో ట్రోలర్స్ కి వార్నింగ్ ఇచ్చింది దేత్తడి హారిక. ‘ఎవడు పడితే వాడు.. బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలు ఊడదీసి కొడతా..’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ పిక్ ఇంస్టా పోస్టులో పెట్టింది. ఈ బుడ్డోడు డైలాగ్‌ని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ‘అదీ అర్ధమైంది కదా??’ అంటూ దేత్తడి అనిపించింది. ప్రస్తుతం హారిక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి హారిక పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.