బిగ్ బాస్ సీజన్ 5 నాలుగో వారం పూర్తిచేసుకోబోతుంది. ఇప్పటికే తొలివారం సరయు, రెండోవారంలో ఉమాదేవి ఎలిమినేట్ కాగా.. మూడోవారంలో లహరి ఎలిమినేట్ అయింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. శనివారం నాడు ఎపిసోడ్ లో ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున. ఈసారి కూడా కాస్త సీరియస్ గానే ఉంటు నాగార్జున ఇంటి సభ్యులను టెన్షన్ పెట్టారు. షణ్ముఖ్ తనతో సరిగ్గా మాట్లాడడం లేదని.. కావాలనే పక్కన పెడుతున్నాడని కాజల్ దగ్గర సిరి వాపోయింది. ఆ తరువాత షణ్ముఖ్ తో మీటింగ్ పెట్టింది సిరి.
ఈ క్రమంలో షణ్ముఖ్.. అందరూ తనను వాడుకుంటున్నారని అనిపిస్తుందని.. జెస్సీ తనను వాడుకున్నా ఆ ఫీలింగ్ రాదని పరోక్షంగా సిరి వాడుకుంటున్నట్లు కామెంట్ చేశాడు. అతని మాటలకు బాధపడుతూ.. టైం వచ్చినప్పుడు అన్నీ నువ్వే తెలుసుకుంటావు అని చెబుతూ.. సిరి అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఇక నాగార్జున అందరికి హాయ్ చెబుతూ.. జెస్సీని అందరు తొక్కేస్తున్నారని పేర్కొన్నాడు. లోబో… ప్రియపై గొంతెత్తి అంతలా అరవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తరువాత కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరికీ బిగ్ బాస్ రివార్డ్స్ ప్రకటించారు. కొందరికి కేక్, మరికొందరికి మఫిన్స్ ఇచ్చారు.
ఈ క్రమంలో సిరి, షణ్ముఖ్ లను మిర్చీలతో ఉన్న ప్లేట్ ను పెట్టారు. ‘తినమ్మా చిన్న ముక్క తిను’ అని నాగ్.. షణ్ముఖ్ కి చెప్పగా.. అతడు మిర్చీను తిన్నాడు. ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తున్నావ్ అంతే.. ఏమీ చేయడం లేదు అంటూ షణ్ముఖ్ పై పంచ్ వేశారు. నీలో ఉన్న ఫైర్ ని బయటకు తీయడానికి మిర్చి ఇచ్చానని అన్నారు. సిరీ నీ ఆట నువ్ ఆడమ్మా అని అన్నారు. గత కొన్ని రోజులు సిరి-షణ్ముఖ్ గేమ్ ప్లాన్ పై విమర్శలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలోనే నాగ్ వీరిద్దరికీ గట్టి కౌంటర్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. అంతే కాదు వీరిద్దరి ఎఫెక్ట్ జెస్సీ పై కూడా పడుతుందని గట్టిగానే మందలించారు నాగార్జున.