ఏపీకి ముఖ్యమంత్రి జగన్.. దేశానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అవకాశం వస్తే కాబోయే రాష్ట్రపతి కూడా. వీరిద్దరి పార్టీలు వేరైనా, భావాలు వేరైనా.. పరోక్షంగానైనా కలిసే సమయం వచ్చింది. ఎలానో చూద్దాం. రాజకీయల్లో శాశ్వత శత్రువు, శాశ్వత మిత్రుడు అంటూ ఎవరూ ఉండరు. ఇటీవల జగన్ పార్లమెంటరీ పార్టీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో త్వరలో రానున్న రాష్ట్రపతి ఎన్నికల పై ఓ స్పష్టత ఇచ్చారు. రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల పై చర్చించారు. వైసీపీ పార్టీ జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్ లకు సమాన దూరంలో ఉంటుందని ప్రకటించారు. అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలుంటాయని తెలిపారు.
రాష్ట్రానికి రావల్సిన నిధులు, హక్కుల విషయంలో నిరంతరం పోరాడాలని జగన్ పిలుపు నిచ్చారు. జగన్ చేసిన వ్యాఖ్యలు బట్టి త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన అడుగులు ఎటువైపు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఇద్దరు సీనియర్ నేతలు పోటి పడనున్నట్లు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థులు గా కాంగ్రెస్ నుంచి గులాం నబీ అజాద్, భాజపా నుంచి తెలుగు తేజం వెంకయ్యనాయుడు ఉండే అవకాశం ఉన్నట్లు కొందరు ఢిల్లీ పెద్దల అభిప్రాయం.
రాష్ట్రపతి అభ్యర్థిగా గులాం నబీ అజాద్ అయితే…
2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ఉండనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత నేత గులాం నబీ ఆజాద్ పేరు కూడా రాష్ట్రపతి రేసులో వినపడుతుంది. వైసీపీ పార్లమెంటరీ సమావేశంలో రానున్న రాష్ట్రపతి ఎన్నికల గురించి జగన్ చర్చించారు. గులాం నబీ ఆజాద్ అయితే జగన్ ఆయనకు మద్దతిచ్చే అవకాశాలు లేవనే చర్చ పార్టీలో జరుగుతుంది. దానికి పలుకారణలు ఉన్నట్లు సమాచారం. 2014 సమయంలో కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసింది. ఈ రాష్ట్ర విభజనలో గులాం నబీ అజాద్ కీలకం వ్యవహరించాడు. అందుకే గులాం నబీ ఆజాద్ రాష్ట్రపతి అభ్యర్థి అయితే మద్దతు ఇవ్వకూడదన్న అభిప్రాయం పార్టీలోనూ వ్యక్తమవుతుంది. అదే అభిప్రాయంలో జగన్ సైతం ఉన్నట్లు సమాచారం.
రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు అయితే…
రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడును ఎంపిక చేస్తే..రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్ మద్దతిచ్చే అవకాశాలుంటాయి. ప్రధాన కారణం తెలుగువాడు కావడం అందులోను ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి కావడం. భవిష్యత్తులో రాష్ట్రానికి ప్రయోజనం ఉండే బిల్లు రాష్ట్రపతికి వెళ్తే తెలుగువాడిగా వెంకయ్యనాయుడు సమర్థించే అవకాశాలుంటాయి. తెలుగు రాష్ట్రాల కోసం వెంకయ్యనాయుడు చేసిన, చేస్తున్న కృషి అందరికి తెలుసు. నిత్యం తెలుగు ప్రజల అభివృద్ధి కోసం పరితపిస్తారు. రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు ఉంటే ప్రక్క రాష్ట్రం తెలంగాణ కూడా బేషరతుగా మద్దతిస్తుంది. కానీ గులాం నబీ ఆజాద్ ను ఎంపిక చేస్తే జగన్ ఆచితూచి నిర్ణయం తీసుకుంటారంటున్నారు. తాను మైనారిటీలకు ఇక్కడ అనేక పదవులు ఇచ్చానని, రాష్ట్ర విభజనకు కారణమైన నేత విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జగన్ అన్నట్లు సమాచారం. చాలా కాలం తరువాత మరోసారి తెలుగు వారికి రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంటే తప్పకుండా మద్దతు ఇచ్చిన తెలుగు కీర్తి దేశ స్థాయిలో ఇనుపడింప చేయాలని కొందరు రాజకీయ నాయకులు అభిప్రాయం