లిక్కర్ స్కామ్ లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురి నేతలను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక నేత కుమారుడు అరెస్ట్ అయ్యారు. అయితే ఆ వ్యక్తి ఏపీకి చెందిన నేత కావడంతో కీలకంగా మారింది. ఏపీలో తొలి అరెస్టుతో కలకలం రేగింది.
గత కొన్ని రోజులుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్ లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురి నేతలను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక నేత కుమారుడు అరెస్ట్ అయ్యారు. అయితే ఆ వ్యక్తి ఏపీకి చెందిన నేత కావడంతో కీలకంగా మారింది. ఏపీలో తొలి అరెస్టుతో కలకలం రేగింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సౌత్ గ్రూప్ ప్రస్తావనలో రాఘవరెడ్డి పేరు రావడంతో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం ఆయనను రెవెన్యూ హౌజ్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇటీవలే ఆడిటర్ బుచ్చిబాబుని అధికారంలోకి తీసుకున్న ఈడీ అధికారులు.. విచారణలో విస్తుపోయే నిజాలను తెలుసుకున్నారు. దీంతో రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు.
లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ దే కీలక పాత్ర వహించిందని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ మీటింగ్స్ లో శ్రీనివాసుల రెడ్డి, ఆయన కొడుకు రాఘవరెడ్డి ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అమిత్ అరోరా, దినేష్ అరోరా, అర్జున్ పాండేల స్టేట్ మెంట్ తో దర్యాప్తు ప్రారంభించిన ఈడీ అధికారులకు రాఘవరెడ్డి గురించి రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దర్యాప్తు ఆధారంగానే రాఘవరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. లిక్కర్ స్కామ్ లో మాగుంటకు చెందిన కంపీనీలు కీలక పాత్ర వహించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. మాగుంట ఆగ్రో ఫామ్స్, బాలాజీ డిస్టిలరీస్, ఏంజెల్ షాంపైన్ కంపెనీలు కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు.
తమిళనాడు డిస్టిలరీ ఆల్కహాల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాగుంటవే అని అధికారులు గుర్తించారు. స్కామ్ లో భాగంగా ఈ కంపెనీలకే లిక్కర్ కేటాయింపులు చేసినట్లు ఆధారాలు సేకరించారు. గతంలో మనీ లాండరింగ్ లో కూడా పలు ఆరోపణలు ఎదుర్కున్న మాగుంట కంపెనీలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. తాజాగా లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర ఉందని తెలిసి.. వైసీపీ ఎంపీ శ్రీనివాసుల రెడ్డి తనయుడు రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు.