పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తాడేపల్లిగూడెంలో ఉన్న ఫుడ్స్, ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీన్ని ‘3ఎఫ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’ గా పిలుస్తుంటారు. సాల్వెంట్ ఆయిల్ ప్లాంట్ లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. 10 మందికి పైగా కార్మికులు లోపల చిక్కుకున్నట్లు సమాచారం. ఆధునీకరణ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడికి చేరుకున్న అగ్నీమాపక సిబ్బంది నలుగురు కార్మికులను రక్షించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.