డుపున పుట్టిన బిడ్డను ఎంతో అపురూపంగా చూసుకుంటుంది తల్లి. తల్లికి కొడుకు ముద్దు అయినా.. అందంగా ముస్తాబు చేసి మురిసిపోయేది మాత్రం కూతురు విషయంలోనే. బయటకు వెళితే.. మగ పురుగుల కామ చూపుల నుండి తప్పిస్తూనే.. వారి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలే పాఠాలు చెబుతుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన అమ్మ..
కడుపున పుట్టిన బిడ్డను ఎంతో అపురూపంగా చూసుకుంటుంది తల్లి. తల్లికి కొడుకు ముద్దు అయినా.. అందంగా ముస్తాబు చేసి మురిసిపోయేది మాత్రం కూతురు విషయంలోనే. ఆడ పిల్లకు తండ్రి దగ్గర చనువున్నప్పటికీ.. కొన్ని విషయాలు తల్లి దగ్గరే చర్చించగలదు. అమ్మాయిని గారాబం చేస్తూనే.. ఇంటి పనులు, వంట పనులు నేర్పిస్తుంది తల్లి. మంచి విషయాలను బోధిస్తుంది. బయటకు వెళితే.. మగ పురుగుల కామ చూపుల నుండి తప్పిస్తూనే.. వారి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలే పాఠాలు చెబుతుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన అమ్మ.. డబ్బు మోజులో పడి.. కన్న కూతురిని అత్యంత పాశవికంగా హింసించిన ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది.
డబ్బు కోసం కూతురిని సినిమా రంగంలోకి దింపేందుకు ఆమెకు నరకం చూపించిన ఓ కసాయి తల్లి కథే ఇది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం తోటపాలెంలో నివాసం ఉంటున్న మహిళకు కుమార్తె పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. ఆ బిడ్డను విశాఖలో చదివిస్తోంది. ఈ క్రమంలో తల్లికి మరొక వ్యక్తితో పరిచయం ఏర్పడి సహజీవనం చేస్తుంది. అయితే ఇటీవల 10వ తరగతి పరీక్షలు పూర్తి చేసిన కూతుర్ని.. సినిమా హీరోయిన్ చేయాలనుకుంది. తరచూ ఇంటికి కొత్త వాళ్లు వస్తుండటంతో కూతురు అనుమానం వ్యక్తం చేసింది. ఇటీవల ఓ వ్యక్తి.. ఆమెకు సినిమాల్లో ఛాన్సులు రావాలంటే శరీర అవయవాలు బాగా పెరగాలని చెప్పాడు. దీంతో ఆమెకు డ్రగ్ ఇంజక్షన్లను ఇవ్వడం మొదలు పెట్టింది. దీంతో బాలిక నిత్యం చిద్ర వధకు గురైంది.
వద్దని ఎంత చెప్పినా తల్లి వినిపించుకునేది కాదూ. దీనికి తోడు కుమార్తెను వ్యభిచారంలోకి నెట్టాలని చూసింది. ఇంజెక్షన్లు ఇవ్వడంతో శరీరం తూట్లు పొడిచినట్లు కావడంతో యువతి తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యింది. చివరికి ఈ నరకం నుండి బయటపడాలని నిర్ణయించుకుని చైల్డ్ లైన్ అధికారులు సమాచారం అందించింది. చైల్డ్ లైన్ అధికారులు.. పోలీసులకు సమాచారం ఇచ్చి బాలికను రక్షించారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో తల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారిని కూడా విచారించారు. ఇంజెక్షన్ల కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన బాలిక..కోలుకోవడానికి సమయం పట్టవచ్చునని వైద్యులు చెబుతున్నారు.