ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం తిరుమలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా కుటుంబ సమేతంగా వెంకయ్య నాయుడు ఆలయానికి చేరుకున్నారు. మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఉపరాష్ట్రపతికి ఆశ్వీరచనాలు అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
చదవండి: జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్.. ఆ ఎన్నికల తర్వాత ప్రకటన
అనంతరం వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ.. “స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. స్వామి దర్శనంతో లభించిన సంతృప్తితో మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తాను. తిరుమలకు ఎన్నిసార్లు వచ్చినా నిత్యనూతన ఉత్సాహం, స్ఫూర్తి కలుగుతుంది. శ్రీవారిని దర్శించుకున్న తరువాత వచ్చే ఆనందం ప్రతి ఒక్కరు పొందాలి. అందుకని ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే స్వామి వారిని దర్శించుకుంటే బాగుంటుంది. అలా చేయడం వల్ల అందరికి శ్రీవారి దర్శన భాగ్యం లభించే అవకాశం ఉంటుంది. ఇదే విధానాన్ని నేను అనుసరిస్తున్నాను” అని వెంకయ్యనాయుడు తెలిపారు.
భక్తుల కోసం టీటీడీ చేసిన ఏర్పాట్ల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మనవరాలు సుష్మ వివాహానికి హాజరవ్వడానికి వెంకయ్యనాయుడు తిరుమలకి వచ్చారు. పుష్పగిరి మఠంలో ఆమె వివాహం జరిపిస్తున్నారు. మరి.. ప్రముఖలు ఏడాదికి ఒక్కసారే స్వామి వారిని దర్శించుకుంటే బాగుంటది అన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మాటల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.