అప్పటివరకు నవ్వుతూ నలుగురితో కబుర్లు చెబుతున్న వారు.. క్షణాల్లో కుప్పకూలేలా చేస్తుంది కార్డియాక్ అరెస్ట్. ఆ సమయంలో క్షణ కాలం గుండె పనిచేయటం ఆగితే చాలు.. ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటాయి. ఆ పరిస్థితులలో కార్డియో పల్మనరీ రిసస్టేషన్(సీపీఆర్) చేయటం ద్వారా తిరిగి గుండె పనిచేసేలా చేయవచ్చు. అలాంటి ప్రయత్నం చేసిన ఇద్దరు మహిళలు.. తోటి మహిళ ప్రాణాలు కాపాడారు.
గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా కార్డియాక్ అరెస్టు బాధితుల సంఖ్య ఎక్కువ అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అప్పటివరకు నవ్వుతూ నలుగురితో కబుర్లు చెబుతున్న వారు.. క్షణాల్లో కుప్పకూలేలా చేస్తుంది కార్డియాక్ అరెస్ట్. ఆ సమయంలో క్షణ కాలం గుండె పనిచేయటం ఆగితే చాలు.. ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటాయి. ఆ పరిస్థితులలో కార్డియో పల్మనరీ రిసస్టేషన్(సీపీఆర్) చేయటం ద్వారా తిరిగి గుండె పనిచేసేలా చేయవచ్చు. అలాంటి ప్రయత్నం చేసిన ఇద్దరు మహిళలు.. తోటి మహిళ ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది.
15 రోజుల క్రితం కాకినాడ జిల్లా, పెద్దాపురం మండలం జి. రాగంపేట గ్రామంలో అంబటి అయిల్ మిల్ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ మృతులను చూడటానికి వచ్చిన బంధువులలో ఒక మహిళ.. ఉన్నట్టుండి స్పృహ తప్పి కోల్పోయింది. అంతలోనే ఆమె గుండె పూర్తిగా కొట్టుకోవడం ఆగింది. ఈ విషయాన్ని గమనించిన స్థానిక రిపోర్టర్, ఆ విషయాన్ని అక్కడే ఉన్న ఏఎన్ఎంకు చెప్పింది. ఇద్దరూ కలిసి ఆమెకు సీపీఆర్ చేశారు. వీడియోలో ఉన్న దాన్ని బట్టి ఒక మహిళ ఛాతి మీద నొక్కమనగా, ఏఎన్ఎం అలా చేయడం మనం చూడొచ్చు. చివరకు వారి ప్రయత్నం ఫలించి.. ఆగిన గుండె మళ్లీ కొట్టుకుంది. ఈ ఘటన రెండు వారాల క్రితం చోటు చేసుకోగా.. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ఆగిన గుండెకు ఊపిరి పోసిన ఇద్దరు మహిళలు.. వీడియో వైరల్! pic.twitter.com/TgRgz9NqSO
— Hardin (@hardintessa143) February 24, 2023
సీపీఆర్ అనేది అనేక అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించడానికి ఉపయోగించే సాంకేతికత. ఉదాహరణకు గుండెపోటు, గుండె ఆగిపోవడం, ఊపిరి ఆడకపోవడం వంటి సందర్భాల్లో సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. హృదయ స్పందన సాధారణ స్థితికి వచ్చే వరకు వ్యక్తి యొక్క గుండె-ఛాతీని నొక్కడం ద్వారా నోటి ద్వారా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియ ఆపకుండా కొనసాగించాలి.దీని వల్ల శరీరంలో అప్పటికే ఉన్న రక్త ప్రసరణ జరుగుతుంది. సీపీఆర్ చేయడానికి ఏ రకమైన వైద్య పరికరాలు లేదా అధునాతన సాంకేతికత అవసరం లేదు.