ప్రపంచంలో తిరుమల తిరుపతికి ఎంత గొప్ప స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాల్లో తిరుమల ఒకటి. ఈ నేపథ్యంలో టీటీడీకి అరుదైన గుర్తింపు లభించింది. ఇంత గొప్ప పుణ్య క్షేత్రానికి ఈ అరుదైన గుర్తింపు లభించింది. ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలు అందిస్తున్నందుకు గాను టీటీడీకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు నేడు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని తిరుమలలో కలిశారు.
టీటీడీకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పిస్తున్నట్టు ఓ ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో టీటీడీకి స్థానం దక్కడం గర్వించదగ్గ విషయం అని అన్నారు.
భారతీయులు ఎంతో గొప్ప దైవంగా భావించే తిరుమలేషుడి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగుతుందని.. ప్రపంచంలో మరే క్షేత్రంలో లేని విధంగా భక్తులకు సేవలు అందిస్తున్నామని, మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని, తమ పనితీరుకు విశిష్ట గుర్తింపు లభించిందని సంతోషం వెలిబుచ్చారు. రోజుల్లో రోజుకు 60 వేల నుంచి 70 వేల మంది భక్తలకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనం చేయిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా తర్వాత పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు టీటీడీ అధికారులు.