దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూసిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, మెగాపవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న ఈ సినిమా నేడు(మార్చి 25) విడుదలైయింది. RRR మూవీని చూసేందుకు అభిమానులు ఎంత దూరమైన వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాలోని వి.కోట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో RRR హీరో అభిమానలు ముగ్గురు మృతి చెందారు.
తమిళనాడులోని పేర్నం బట్టు నుంచి చిత్తూరు జిల్లాలోని వి.కోటకు వస్తుండగా పాపేపల్లి వద్ద రాత్రి ఒంటిగంట సమయంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్ లు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరు యువకులను కుప్పం పీ.ఈ.ఎస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ యువకులు ముగ్గురు తమిళనాడుకు చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల సందర్భంగా వి.కోటలో భారీ కటౌట్లు కట్టి తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.