సమాజంలో పోలీసులకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఎవరైన తప్పు చేస్తే పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలిచండం, కోర్టులో హాజరపర్చడం పోలీసుల బాధ్యత. చాలా మంది పోలీసులు.. తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తుంటారు. కానీ కొందరు పోలీసులు మాత్రం అతిగా వ్యవహరించి పోలీస్ వ్యవస్థకు అపకీర్తి తెస్తుంటారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఓవరాక్షన్ చేస్తుంటారు. కొందరు పోలీసుల అయితే నిందితులనే కాక బాధితుల పట్ల కూడా అమర్యాదగా ప్రవర్తించడం చేస్తుంటారు. ఇంకొందరు పోలీసులు అయితే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి.. లైంగిక వేధింపులకు పాల్పడుతుంటారు. ఇలా కొందరు పోలీసులు చేసే అతి ఓవరాక్షన్ కు సంబంధించిన ఘటనలు అనేకం వెలుగు చూశాయి. తాజాగా కృష్ణాజిల్లాలో పోలీసులు మహిళలతో అతిగా ప్రవర్తించారు. వారు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కృష్ణా జిల్లా ఉయ్యూరు పోలీసులకు ఆకునూరోల వ్యభిచారం నడుపుతున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు నిఘా పెట్టి ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్దారించుకున్నారు. ఈ క్రమంలోనే ఉయ్యూరు రూరల్ పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు చేశారు. పోలీసుల దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళతో పాటు ఓ విటుడిని, ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వారిని అరెస్ట్ చేయకుండా.. కొద్ది సమయం పాటు వ్యభిచార గృహంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఆ గృహంలో దర్జాగా కూర్చొని చేతిలో పేక ముక్కులు పట్టుకుని, మరొకవైపు పట్టుబడిన యువతులతో ఆడిస్తూ బెదిరించారు. అంతేకాక దుస్తులు మార్చుకొని వస్తారా? లేక ఇలానే కొట్టుకుంటూ తీసుకెళ్లాలా? అంటూ వారిపై బెదిరింపులకు పాల్పడ్డారు.
భయపడిపోయిన మహిళలు వేడుకున్నా వినిపించుకోకుండా పోలీసులు వారితో అమానుషంగా వ్యవహరించారు. ఈ పోలీసుల వ్యవహారాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఉయ్యూరు పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాళ్లు నేరం చేసి ఉంటే.. కేసు నమోదు చేసి కోర్టు లో హాజరు పర్చాలే కానీ.. ఇలా అతిగా ప్రవర్తించడం ఏంటని కొందరు అంటున్నారు. నిందితులు, బాధితుల పట్ల బాధ్యతగా మెలగాల్సిన పోలీసులు ఇలా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
వ్యభిచారం రైడ్కని వెళ్లి దర్జాగా కూర్చుని పేకాలాడిస్తూ, “పచ్చిగా ఉంటది మాతో యవ్వారం, నైటీల మీదే కొట్టుకుంటూ తీస్కెళ్లాలా బట్టలు మార్చుకుంటావా” అంటున్నాడీ పోలీసు
ఉయ్యూరు రూరల్ pic.twitter.com/T77YQWwNdJ
— Anjan (@pdsdnn) December 14, 2022