గత కొంత కాలంగా ఏపి లో అధికార, ప్రతిపక్షాల మద్య రగడ కొనసాగుతుంది. ఇటీవల టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నేతల దాడులను ఖండిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు టీడీపీ కార్యకర్తలను బెదిరిస్తే.. దాడులు చేస్తే సహించబోమని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఉదయం స్వల్పంగా గాయపడ్డారు.
కుప్పంకు వెళ్లే క్రమంలో ఈ ఉదయం ఆయన బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన గ్రామానికి చేరుకోవాలంటే రోడ్డు మార్గం ద్వారా బయలు దేరాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బెంగుళూరు ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబుకు పెద్ద సంఖ్యలో టీడీపీ మద్దతుదారులు స్వాగతం పలికారు.
ఆ సమయంలో పలువురు కార్యకర్తలకు కరచాలనం చేసే క్రమంలో ఆయనకు స్వలప్ప గాయం అయ్యింది. వెంటనే గాయానికి చికిత్స చేశారు. ఆ తర్వాత చంద్రబాబు అక్కడి నుంచి కుప్పంకు బయల్దేరి వెళ్లారు. రేపటి వరకు చంద్రబాబు కుప్పం పర్యటన కొనసాగనుంది.
