లోకేష్ యువగళం పాదయాత్రలో తారకరత్న గుండె పోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు కుప్పం పీఈఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయన్ని బెంగళూరు ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వార్త తారకరత్నకు, వైఎస్సార్ సీపీ కీలక నేత విజయసాయిరెడ్డి బంధుత్వానికి సంబంధించింది. ఇంతకీ తారకరత్నకు విజయసాయిరెడ్డికి ఉన్న సంబంధం ఏంటీ అంటే.. విజయసాయిరెడ్డి భార్య సొంత చెల్లెలి కూతురిని తారకరత్న పెళ్లి చేసుకున్నారు. ఈ లెక్కన విజయసాయిరెడ్డికి తారకరత్న అల్లుడు అవుతారు. అది కూడా చాలా దగ్గరి సంబంధం. తారకరత్నది టీడీపీ అయినా.. విజయసాయి రెడ్డి ఇంటికి అల్లుడే అవుతారన్నది ఆ వార్త సారాంశం.
తారకరత్న.. అలేఖ్యల ప్రేమ పెళ్లి!
విజయసాయిరెడ్డి భార్య సునంద సొంత చెల్లెలి కూతురు అలేఖ్య. ఈమె సినిమా ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసేవారు. తారకరత్న నటించిన నందీశ్వరుడు సినిమాకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. కొంతకాలం ప్రేమించుకున్న వీరు హైదరాబాద్‌లోని సంఘీ గుడిలో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి అతి కొద్ది మంది బంధు మిత్రులు మాత్రమే హాజరయ్యారు.
కాగా, శుక్రవారం మొదలైన లోకేష్ యాత్రకు మద్దతు తెలపటానికి నందమూరి తారకరత్న వెళ్లారు. ఈ సందర్భంగా ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆయనకు పరీక్షలు చేసి హార్ట్ ఎటాక్ వచ్చినట్లు తేల్చారు. మరి, తారకరత్నకు, వైఎస్సార్ సీపీ కీలక నేత విజయసాయిరెడ్డికి మధ్య ఉన్న సంబంధంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.