ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఇప్పుడు అంతా రాజధాని గురించే చర్చ. మూడు రాజధానులు కావాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అని అధికార వైసీపీ పోరాడుతోంది. అయితే ఒకే రాజధాని కావాలంటూ టీడీపీ, జనసేన, బీజీపీ, ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలంటూ ఉత్తరాంధ్రవాసులు పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాజధానిగా అమరావితినే అభివృద్ధి చేయాలంటూ రైతులు మహాపాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీళ్ల పాదయాత్రకు గోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున నిరసన సెగ తగిలింది. ఇప్పటివరకు రాజధానుల విషయం అనేది రాజకీయ పార్టీల మధ్యనే కొనసాగింది. అయితే ఇప్పుడు మూడు రాజధానులను డిమాండ్ చేస్తున్న గొంతుకలు పెరుగుతున్నాయి.
ఒక రాజధాని వద్దు, మూడు రాజధానులు ముద్దు, విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలంటూ పాఠశాల విద్యార్థులు సైతం ర్యాలీకి దిగారు. శ్రీకాకుళం జిల్లాలో పాఠశాల విద్యార్థులు మూడు రాజధానులకు మద్దతుగా.. విశాఖను పరిపాలన రాజధాని చేయాలంటూ భారీ ర్యాలీ చేపట్టారు. ఆమదాలవలసకు చెందిన పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. తమకు ఒక రాజధాని వద్దు అంటూ నినాదాలు చేశారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని నినదించారు. తమకు మూడు రాజధానులు కావాలని గొంతెత్తి డిమాండ్ చేశారు. విశాఖను పరిపాలన రాజధాని చేయాలంటూ ఆమదాల వలస విద్యార్థులు కోరారు. ఫ్లెక్సీలు పట్టుకుని, ప్లకార్డులతో విద్యార్థులు చేసిన ర్యాలీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒక్క రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అని ఈరోజు ఆమదాలవలసలో విద్యార్థి,విద్యార్థులు బారి ర్యాలీ చేశారు.#CMYSJagan #AndhraNeeds3Capitals #AndhraPradesh #ManaSrikakulam pic.twitter.com/3qKrC2FKxV
— Mana Srikakulam (@ManaSKLMDist) October 17, 2022