జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సక్సెస్ఫుల్గా ప్రారంభమైంది. సమ్మిట్ మొదలైన కొద్దిసేపటికే ఓ సంస్థ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ విశాఖలో ఘనంగా ప్రారంభమైంది. సమ్మిట్లో తొలుత రాష్ట్ర గీతం ‘మా తెలుగు తల్లికి’ను అందరూ ఆలపించారు. ఆ తర్వాత సీఎం జగన్ జ్యోతిని వెలిగించి సదస్సును మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు, ఇన్ఫోటెక్ అధినేత బీవీఆర్ మోహన్ రెడ్డి తదితర ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. అంబానీని జగన్ ఆప్యాయంగా హత్తుకోవడం సదస్సులోని అందర్నీ ఆకర్షించింది. జ్యోతి ప్రజ్వలన అనంతరం సీఎస్ జవహర్ రెడ్డితో పాటు గుడివాడ అమర్నాథ్ ప్రసంగించారు. ఏపీలో ఇండస్ట్రీల ఏర్పాటుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని వారు చెప్పుకొచ్చారు.
ఇక, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మీట్ తొలి రోజు ఏపీలో పెట్టుబడులకు ముందుకొస్తున్నట్లు ప్రకటించింది శ్రీ సిమెంట్ గ్రూప్. తాము ఆంధ్రప్రదేశ్లో రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నామని శ్రీ సిమెంట్ లిమిటెడ్ గ్రూప్ చైర్మన్ హరిమోహన్ బంగూర్ తెలిపారు. దీని ద్వారా దాదాపు 5 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగానూ ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు. అలాగే రాష్ట్ర ఖజానాకు ప్రతి ఏడాది రూ.1,000 కోట్లు విరాళం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ సమ్మిట్ ద్వారా దాదాపుగా రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని జగన్ సర్కారు ధ్యేయంగా పెట్టుకుంది. ఏపీ సర్కారు అనుకున్నంతగా పెట్టుబడులు వస్తాయేమో చూడాలి. మరి.. గ్లోబస్ ఇన్వెస్ట్మెంట్ మీట్ ఏపీలో పెట్టుబడులకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#GlobalInvestorsSummit2023 |
“We are looking to invest ₹5,000 cr & create 5,000 direct & indirect jobs. Will lead to a ₹1,000 cr contribution to the State exchequer annually, says #ShreeCement MD#HariMohanBangur @Advantage_APGov @AndhraPradeshCM @NewIndianXpress— TNIE Andhra Pradesh (@xpressandhra) March 3, 2023