యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సీటీమార్’. తమన్నా కథానాయిక. ఈ సినిమా వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10న వినాయక చవితి సందర్భంగా విడుదల కాబోతోంది. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ ‘ఆంధ్రప్రదేశ్ ఫీమేల్ కబడ్డీ టీమ్’కి కోచ్‌గా చేస్తుంటే – తమన్నా ‘తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్’ జ్వాలా రెడ్డిగా చేస్తోంది. హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ మూవీలో మరో హీరోయిన్‌గా హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ ట్రైలర్’ను రామ్ పోతినేని తన సోషల్ మీడియా వేదికగా విడుదలచేశాడు.
ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ‘సీటీమార్’ ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావాల్సి ఉంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, గ్రామీణ ప్రాంతంలో ఉన్న కొందరి యువతులను ఎలా ఛాంపీయన్స్‌గా మార్చారు., దానికోసం ఎలాంటీ కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందనేది కథగా కనిపిస్తోంది. తమన్నా సొంతంగా డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది.
ట్రైలర్ విషయానికి వస్తే… మాస్ లుక్ లో హీరో గోపీ చంద్ అదరగొట్టాడు. తన దైన డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కబడ్డీ ఆట చుట్టు ఈ సినిమా తిరుగనుందని ట్రైలర్ చూస్తే మనకు అర్థమౌతుంది. కబడ్డీ కోసం గోపీచంద్ ఎలాంటి రిస్క్ చేస్తాడనేదే ఈ సినిమాలో హైలెట్ కానుంది. సౌందర రాజన్ కెమెరా పనితనం ఈ సినిమాకు హైలెట్ గా ఉండబోతోంది.
హీరో రాం ఈ సినిమా గురించి చేసిన ట్వీట్ మీకోసం:
. @YoursGopichand & @tamannaahspeaks look Fantastic! A BIG Screen experience for sure! 👍https://t.co/2OljVmP1QB#𝐒𝐞𝐞𝐭𝐢𝐦𝐚𝐚𝐫𝐫𝐎𝐧𝐒𝐞𝐩𝐭𝟏𝟎
Good luck @IamSampathNandi@srinivasaaoffl @SS_Screens @DiganganaS @bhumikachawlat @actorrahman #Manisharma @adityamusic
— RAm POthineni (@ramsayz) August 31, 2021