ఉప్పు, పప్పు, పాలు, నూనే, మాంసం కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు కొంతమంది వ్యాపారస్తులు కాసులకు కక్కుర్తి పడుతూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు. కల్తీ పాలు, కుల్లిన మాంసం హూటల్స్ కి సప్లై చేస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
ఈ మద్య మనిషి డబ్బు సంపాదించడానికి ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. తాను బాగుండాలి.. ఎదుటి వారు ఎలా చనిపోతే నాకేంటీ అన్న చందంగా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొంత మంది వ్యాపారులు. ఉప్పు, పప్పు, పాలు, నూనే ఒక్కటేమిటి ప్రతి ఒక్కటీ కల్తీ మయం చేస్తున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో పాలు, మాంసం కల్తీ చేస్తున్న వ్యాపారులపై కొరడా ఝులిపిస్తున్నారు అధికారు. వివరాల్లోకి వెళితే..
తిరుపతి గూడూరు లో మంసం దుకాణాల్లో విసృతంగా తనిఖీలు నిర్వహించారు. భారీగా నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు మున్సిపల్ అధికారులు. సదరు వ్యాపారస్తులు ఈ మాంసాన్ని హూటల్స్ కి సరఫరా చేసేందుకు సిద్దమవుతున్నారు. బయట పొట్టేలు మాసం అని చెబుతూ.. లోపల గొర్రె మాంసం విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా ఏపీ వ్యాప్తంగా లీగల్ మెట్రాలజీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 208 మంది వ్యాపారస్తులపై కేసులు నమోదు చేశారు. రెండు నెలల వ్యవధిలో 2 వేలకు పైనే కుల్లిన మాంసాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు అధికారులు.
మరోవైపు యాదాద్రి జిల్లా భువనగిరిలో ఎస్ఓటీ అధికారులు కల్తీ పాల వ్యాపారం జరుగుతుందన్న విషయం తెలుసుకొని మెరుపు దాడులు నిర్వహించారు. చౌటుప్పల్ మండలం ఎల్లంబాయిలో పాల కేంద్రంపై దాడులు చేశారు. ఇందులో 110 కల్తీ పాలు, 1 లీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 14 కిలోల మిల్క్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. బాలశేఖర్ అనే పాల వ్యాపారి గత కొంత కాలంగా కల్తీ పాల వ్యాపారం చేస్తూ ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారని.. ఇలాంటి పాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని అధికారులు వెల్లడించారు. బాలశేఖర్ ని అరెస్ట్ చేశారు పోలీసులు.
దేశంలో జనాభా పెరుగుతుంది.. ఇందుకు అనుగుణంగా భారీ ఎత్తున హూటల్స్, రెస్టారెంట్స్, బిర్యానీ హౌజులు పెరిగిపోతున్నాయి. ఇక్కడ ప్రజలకు నచ్చేవిధంగా వంటలు చేసి పెడుతున్నారు. ముఖ్యంగా మంసాహారులకు రక రకాల వంటకాల రుచిని అందిస్తున్నారు సదరు యజమానులు. ఈ క్రమంలోనే కొంతమంది మాంసం వ్యాపారులు వక్ర బుద్ది చాటుకుంటూ నిల్వ ఉంచిన మాంసం, కుళ్లిపోయిన మాంసం సదరు హూటల్స్ కి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు హోటల్స్, బార్స్, రెస్టారెంట్స్ లో మున్సిపాలిటీ శానిటరీ సిబ్బంది తనిఖీలు చేసి పాడైనపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి దారుణమైన తిండి తింటే బ్రతుకుతామా? అన్న భయం ప్రజల్లో కలుగుతుంది. అక్రమ దందాలకు పాల్పపడిన వారిని కఠినంగా శిక్షించాలని వినియోగదారులు కోరుతున్నారు.