సాధారణంగా మనం గ్రామీణ ప్రాంతాల్లో కోళ్లపందాలు, ఎడ్ల పందాలు, కర్రసాములు, ఆటలపోటీలు చూస్తుంటాం. అలాగే ఓ గ్రామంలో లేడీస్ కోసం రన్నింగ్ రేస్ నిర్వహించారు.
సాధారణంగా గ్రామాల్లో ఆటల పోటీలు, పాటల పోటీలు, కుస్తీ పోటీలు, ఎడ్ల పందేలు, కోళ్ల పందాలు, కర్రసాము చూస్తుంటాం. పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు కూడా ప్రకటిస్తారు. ఏ కాంపిటీషన్స్‌లోనైనా మగవారికి సమానంగా ఆడవారు కూడా పాల్గొనడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఓ గ్రామంలో ఉరుకుడు పోటీలు కేవలం ఆడవారికి నిర్వహించారు. అందులో గెలుపొందిన వారికి బహుమతులు కూడా ఇచ్చారు.
గ్రామాల్లో ఆడవాళ్లు తెల్లవారు జామున్నే లేచి ఇంటిపని, వంటపని చేసుకుంటారు. పొద్దుపొడిచే పాటికి పొలం పనులకు సద్ది తీసుకొని బావి దగ్గరకు వెళతారు. పొలం దగ్గర మగవారికి సాయంగా పంటపొలంలో దున్నడం, నాట్లు వేయడం, కలుపుతీయడం, నీళ్లు మళ్లించడం ఇలా చాలా పనులు చేస్తుంటారు. సాయంత్రం చీకటి పడేలోపు ఇంటికి తిరిగి వస్తారు. మళ్లీ వంటపని అయిన తర్వాత గేదెల పాలు పిండి పశువులకు మేత వేస్తారు. తిని నిద్రపోతారు మళ్లీ తెల్లవారుజామునే నిద్ర లేస్తారు. ఇలా కష్టపడే విలేజ్ లేడీస్‌కి కొంత రిలాక్స్ కోసం రన్నింగ్ రేస్ నిర్వహించారు. అది ఎక్కడ? ఏమా కథ వివరాల్లోకి వెళితే..
కర్నూలు జిల్లా బసలదొడ్డి గ్రామంలో ఏరువాక పున్నమి నేపథ్యంలో లేడీస్‌కు ఇలా రన్నింగ్ పోటీలు నిర్వహించారు. ఒక కిలో మీటర్ దూరం ఆగకుండా పరుగెత్తి ముందుగా గమ్యం చేరిన వారికి విన్నర్‌గా ప్రకటించి ప్రైజ్ ఇచ్చారు. చీర శింగులు మీదికి చెక్కి శివంగుల్లా పరుగెత్తి బహుమతులు గెలుచుకున్నారు. ఒక్కొక్కరు పీటీ ఉష లెవల్లో పరుగెత్తి పతకాలు గెలుచుకున్నారు. అందరు 40 ఏళ్ల పైబడిన వారు పాల్గొన్నారు. అయినాకూడా చాలా స్పీడ్‌గా పరుగెత్తారు. వారి ఉరుకుడు చూసిన ఊరిలో పిల్లలు, పెద్దలు అందరు చప్పట్లు, ఈలలు వేయసాగారు. పరుగెత్తేవారిని ప్రోత్సహించారు. ఇలా పోటీలు నిర్వహించడంతో గ్రామీణ ప్రాంతంలోని లేడీస్ సంతోషం వ్యక్తం చేశారు. రోజు పనులతో తలమునకలయ్యే వారికి కొంతమేర రిలాక్స్ దొరికిందని ఆనందించారు. ప్రస్తుతం ఈ వీడియో నట్టింట వైరల్ అవుతుంది. విలేజ్ లేడీస్ రన్నింగ్ రేస్ పై మీ కామెంట్స్ తెలియజేయండి.