తిరుపతిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులతో తిరుపతి నుండి తిరుమలకు వెళుతున్న బస్సు ఓ పిట్టగోడను ఢీ కొట్టింది. డీవైడర్ ను ధాటి గోడను బలంగా ఢీ కొట్టింది.
తిరుపతిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుండి తిరుమలకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఓ పిట్ట గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన తిరుమల రెండవ ఘాటు రోడ్డులో జరిగింది. తిరుమల దర్శనానికి వెళ్లేందుకు కొండపైకి ప్రయాణీకులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు రెండవ ఘాటు రోడ్డు దగ్గరకు రాగానే.. ఢీ వైడర్‌ను దాటి పిట్ట గోడను ఢీ కొట్టి ఒరుసుకుంటూ వెళ్లింది. దీంతో బస్సు ఓ వైపుకు ఒరిగిపోయింది. అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్ బస్సును నియంత్రించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ప్రయాణీకులకు ప్రాణాపాయం తప్పింది. కొంత మందికి స్వల్పంగా గాయాలయ్యాయి.
వీరందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రయాణికులను వేరే బస్సు ద్వారా తిరుమలకు తరలించారు. క్రేన్లను తీసుకొచ్చి, బస్సును ఆర్టీసీ ఉద్యోగులు. కాగా.. కొద్దిరోజుల కిందటే ఆర్టీసీ బస్సు ఒకటి ఇదే ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. కొద్ది రోజుల క్రితమే ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు ఇదే ప్రాంతంలో అదుపు తప్పి, లోయలోకి జారిపడబోయింది. లోయ అంచుల్లో ఉన్న చెట్లకు చిక్కుకుని నిలిచిపోయింది. ఇటువంటి ప్రమాదాలు జరుగుతుండటంతో తిరుమల దర్శనానికి వచ్చే ప్రయాణీకులు సైతం భయాందోళనకు గురౌతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
అటు మహా శివరాత్రి శనివారం రావడంతో పాటు ఆదివారం వరుస సెలవు దినాలు కావడంతో శ్రీవారిని దర్శించుకనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. తిరుమల కొండపై ఉన్న కంపార్ట్మెంట్లలో 14 నిండిపోయాయి. భక్తులు గంటలు, గంటలు క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. సర్వ దర్శనానికి 19 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారిని 65,633 మంది భక్తులు దర్శించుకోగా, 23,352 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమల కొండపై వరుసగా జరగుతున్న ఈ ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.