ఆంధ్రప్రదేశ్ లో పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరి కాసేపట్లో ఇంటికి చేరుకుంటామన్న ఆనందాన్ని ఆవిరి చేస్తూ.. వారంతా మృత్యు ఒడికి చేరుకున్నారు. స్థానికులు ఈ ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరాడ దగ్గర ఆటోను లారీ ఢీ కొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి వేడుకలకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను ఆసుప్రతికి తరలించారు. వీరంతా కొమరాడలోని అంటివలస గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మరికొద్ది సేపటిలో ఇంటికి వెళుతున్న సమయంలో వెనుక నుండి ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది. దీంతో ఆ ప్రాంతమంతా రక్తమోడింది.
పెళ్లి వేడుకలకు హాజరై మొత్తం 10 మంది కలిసి ఆటోలో కొమరాడకు బయలు దేరారు. మండలంలోని చోళపదం దగ్గర ఆటో రాగానే.. వెనుక నుండి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతదేహాలన్నీ చెల్లా చెదురుగా పడ్డాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు ఘటనపై పోలీసులకు సమాచారం అందిచారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.