తెలుగు రాష్ట్రాలలో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేగింది. బర్త్ డే పేరుతో యువతీయువకులు అర్ధనగ్న డాన్స్ లతో రెచ్చిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు రేవ్ పార్టీపై దాడి చేసి.. పది మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో ముగ్గురు యువతులు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది. పట్టుబడ్డ విద్యార్థులంతా ఓ ప్రముఖ కళాశాలలో ఇంటర్‌మీడియట్ చదువుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాలలో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేగింది. బర్త్ డే పేరుతో యువతీయువకులు అర్ధనగ్న డాన్స్ లతో రెచ్చిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు రేవ్ పార్టీపై దాడి చేసి.. పది మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ విద్యార్థులంతా విజయవాడలో ఓ ప్రముఖ కళాశాలలో ఇంటర్‌మీడియట్ చదువుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎన్‌టీఆర్ జిల్లాలోని కొండపల్లిలో చోటుచేసుకుంది.
పుట్టినరోజు పేరుతో కొంతమంది విద్యార్థులు కలిసి శాంతినగర్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం అందుకున్న పోలీసుల ఆ స్థావరంపై దాడి చేశారు. అప్పటికే కొంతమంది విద్యార్థులు అక్కడినుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో మొత్తం 10 మంది యువతీయువకులు అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరి వద్ద నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులోని కాల్ డేటా ఆధారంగా ఎంత మంది ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారనే విషయంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో ముగ్గురు యువతులు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది. వారి వివరాలను సేకరించి అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను పంపినట్లు పోలీసులు తెలిపారు. అయితే రేవ్ పార్టీలో కేజీ గంజాయి స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. వీరికి కేజీ గంజాయి ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? అన్న దానిపై పోలీసులు విచారణ మొదలు పెట్టారు. పట్టుబడ్డ వారు ఇంటర్‌మీడియట్ విద్యార్థులు కావడంతో.. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి త్వరలోనే పూర్తి విషయాలను బయటపెట్టనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.