సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అని తెలిసిందే. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఆయన వైసీపీ తరపున పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అని తెలిసిందే. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటాడు. అలానే అమ్మాయిలతో పార్టీలు చేసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తుంటాడు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా కొనసాగిన ఆర్జీవీ… ఎన్నో హిట్ చిత్రాలను అందించాడు. అయితే ఇటీవలే పొలిటికల్ విషయాల్లో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటున్నాడు. వైసీపీకి తరపున మాట్లాడుతూ.. వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కొంతకాలం నుంచి ఆర్జీవీ వైసీపీ కి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. గతంలో సీఎం జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా ఓ సినిమాను కూడా తీశాడు. అలానే లక్ష్మి పార్వతికి అనుకూలంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాను తెరకెక్కించాడు. అలానే టీడీపీ నేతలకు వ్యతిరేకంగా, వైసీపీకి అనుకూలంగా ట్వీట్లు చేస్తుంటారు. ఇటీవలే విజయవాడలో ఎన్టీఆర్ జయంతి వేడుక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఖ్యాతి గురించి తెలిపాడు. అలానే ఎన్టీఆర్ కు నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ హాట్ కామెంట్స్ చేశాడు. అంతేకాక టీడీపీపై, ఆ పార్టీ నాయకులపై పరోక్షంగా కామెంట్స్ కూడా చేస్తుంటాడు.
అలానే సీఎం జగన్ మోహన్ రెడ్డి గొప్ప పరిపాలకుడు అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇలా నిత్యం వైసీపీ తరపున మాట్లాడుతాడు. ఈ క్రమంలో ఆర్జీవీ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది. 2024 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ తరపున పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలోని ఏదో ఒక నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నారంటూ వార్తలు వినిపిస్తోన్నాయి. మరి.. ఆర్జీవీ వైసీపీ తరపున పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.