ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ రాజకీయాల్లో రెండు శక్తివంతమైన రాజకీయ కుటుంబాలకు చెందిన ఇద్దరు వారసులు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఈ భేటీపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన వంగవీటి మోహన రంగా, పరిటాల రవి వారసులు.. రాధా, శ్రీరామ్ భేటీ కావడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆదివారం వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్ భేటీ కావడంపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న ఈ రెండు కుటుంబాలకు చెందిన వారసుల తొలి సమావేశం ఇదే కావడం గనమార్హం. దాంతో ఈ భేటీ చర్చనీయాంశమైంది.
అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనేందుకు రాజమహేంద్రవరం వచ్చిన వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్‌లు మరో యువనేత జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్‌తో కలిసి ఓ ప్రైవేటు ప్రాంతంలో కలిశారు. సరదాగా ముచ్చటించుకున్నారు. ఇక గతంలో వంగవీటి రాధాను హత్య చేసేందుకు దుండగులు రెక్కీ చేసినట్లు ఆరోపణలు వచ్చిన సమయంలో పరిటాల శ్రీరామ్ తీవ్రంగా స్పందించారు. వంగవీటి రాధా తెలుగుదేశం కుటుంబ సభ్యుడని శ్రీరామ్ వెల్లడించారు. ఇక, అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన మహా పాదయాత్రలో సోమవారం వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్ పాల్గొని మద్దతు తెలపనున్నారు. ఏది ఏమైనా రాజకీయాల్లో శక్తివంతమైన కుటుంబాలకు చెందిన ఇద్దరు వారసులు ఇలా సమావేశం కావడం మాత్రం ఆసక్తికర పరిణామే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
రాజమండ్రి నగరంలో వంగవీటి రాధా గారితో సమావేశమైన సందర్భంగా… pic.twitter.com/OoJlwLYt9l
— Paritala Sreeram (@IParitalaSriram) October 16, 2022