తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు.. బుధవారం నాడు నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన పట్ల చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన వారికి పార్టీ తరపున 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు బహిరంగ సభలో జరిగిన దుర్ఘటన వల్ల తీవ్రంగా కలత చెందినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తామని ట్వీట్ చేశారు.
పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మృతుల కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు,క్షతగాత్రులకు రూ. 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తాం : పిఎం @narendramodi
— PMO India (@PMOIndia) December 29, 2022