అత్తారింటికి అమ్మాయిని సాగనంపడానికి ఈరోజుల్లో బాగా ఉన్నోళ్లు, ఓ మాదిరి ఉన్నోళ్లు కూడా కారునే వాడుతున్నారు. అయితే ఒక తండ్రి ఏకంగా తన కూతురిని హెలికాప్టర్ లో సాగనంపారు.
స్వతంత్ర దేశంలో డబ్బున్నవారు పెళ్లిళ్లు చాలా గ్రాండ్ గా చేస్తారు. పెళ్లి జీవితంలో ఒకసారే వచ్చేది కాబట్టి అంగరంగ వైభవంగా చేస్తారు. పెళ్లికొచ్చిన అతిథులకు మర్యాదలో లోటు లేకుండా చూసుకుంటారు. పెళ్లి కార్యక్రమం, ఆ హడావుడి అంతా మామూలుగా ఉండదు. ఎంత డబ్బు ఉంటే అంత ఘనంగా ఉంటుంది. అయితే ఎంత డబ్బు ఉన్నా చివరకు కూతురిని అత్తారింటికి సాగనంపాల్సి వస్తే కార్లలోనే కదా ఏ తండ్రైనా పంపించేది. మహా అయితే కారు బ్రాండ్లు మారతాయేమో. లగ్జరీ కార్లలో పంపిస్తారు.
అయితే ఒక తండ్రి ఏకంగా తన కూతురిని ఏకంగా హెలికాప్టర్ లో సాగనంపారు. కొత్తగా పెళ్ళైన నవ వధువును వరుడితో కారు ఎక్కించి పంపడం రెగ్యులర్. కానీ హెలికాప్టర్ లో పంపితే ఎరైటీ అని అనుకున్నారేమో. తన కూతురిని ఒక తండ్రి అప్పగింతల తర్వాత హెలికాప్టర్ లో ఎక్కించి అత్తారింటికి సాగనంపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతోంది. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కుమార్తె వివాహ వేడుకలో భాగంగా ఈ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది.
ద్వారకానాథ్ తన కుమార్తెను ఇలా హెలికాప్టర్ లో అత్తారింటికి సాగనంపారు. హెలికాప్టర్ లో పంపే ముందు ఫోటో షూట్ కూడా నిర్వహించారు. ఆ రకంగా కొత్త దంపతులిద్దరూ హెలికాప్టర్ లో చక్కెర్లు కొట్టారు. వరుడి వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాబట్టి.. కారులో అయితే ప్రయాణం ఆలస్యం అవుతుందని ఇలా హెలికాప్టర్ ని ఏర్పాటు చేసి ఉండవచ్చునని కామెంట్స్ చేస్తున్నారు. మరి తన కూతుర్ని అత్తారింటికి హెలికాప్టర్ లో పంపడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.