ఏపీలో తుఫాన్ సృష్టిస్తున్న బీభత్సం అంతాఇంతా కాదు. వేల ఎకరాలు నీట మునిగాయి. వందల మూగ జీవాలు నీటిలో కొట్టుకపోయాతున్నాయి. ఆస్తి నష్టం జరిగింది. ఎందరో ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. వరద బాధితులను రక్షించేందుకు ప్రాణాలను ఫణంగా పెట్టి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నాయి. అర్ధరాత్రి అయినా.. వరద ఉధృతి ఎలా ఉన్నా.. బాధితులను కాపాడడమే కర్తవ్యంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విధులు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ సహాయక చర్యల్లో ఓ విషాదం జరిగింది.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు వద్ద ఆయన సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్‌ఎఫ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఆయన విజయనగరం జిల్లా జిల్లా 5వ బెటాలియన్ కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ కెల్లా శ్రీనివాసులు. శ్రీనివాసులు వేసుకున్న లైఫ్ జాకెట్ ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో వరద ప్రవాహానికి ఆయన కొట్టుకుపోయారు. ఊపిరాడక నీటిలో కానిస్టేబుల్ మృతి చెందారు. తమతో పాటే బాధితులను రక్షించేందుకు వచ్చిన శ్రీనివాసులు.. అకస్మికంగా వరద నీటిలో మృతి చెందడం పట్ల తోటి సిబ్బంది కంటతడి పెట్టుకున్నారు.