రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబాని శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన fవెంట కొడుకు అనంత్ అంబాని, కాబొయే కోడలు రాధిక కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులతో తిరుమలకు చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ముఖేష్ అంబాని ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం తిరుమల దర్శనంలో భాగంగానే అంబాని గోశాలకు వెళ్లి అక్కడ పరిశీలించారు.
ఇక ఇదే కాకుండా శ్రీవారి ఆలయం ఎదుట అంబాని ఓ మొక్కను కూడా నాటారు. స్వామివారి అభిషేక సేవలో పాల్లొన్న అనంతరం ముఖేష్ అంబాని టీటీడీకి రూ.1.5 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ముఖేష్ అంబాని వెంట వైసీపీ ఎంపీ, ఎమ్మేల్యే చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి, పలువురు ఆలయ అధికారులు ఉన్నారు. రిలయన్స్ సంస్థ అధినేత టీటీడీకి అందించిన ఈ భారీ విరాళంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.