ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల దర్శనం అనంతరం కారులో కాణిపాకం వెళ్తుండగా చంద్రగిరి మండలం కల్రొడ్డు పల్లి వద్ద కల్వర్టును ఢీ కొంది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారంతా మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ కారులో సుమారు 9 మంది భక్తులున్నారని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను రుయా ఆసుప్రతికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.