పేదవారికి ప్రాణంతకమైన జబ్బు వస్తే.. ఇక మరణమే శరణ్యం అనుకునే రోజులు. కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం కొనలేము.. ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం దొరకదు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని.. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తీసుకువచ్చిన అద్భుతమైన పథకం ఆరోగ్యశ్రీ. పేదవారికి కూడా కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ పథకం ఎందరో జీవితాలను నిలబెట్టింది. తాజాగా గుండె జబ్బుతో ప్రాణాపాయంలో ఉన్న ఓ యువకుడికి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పునర్జన్మ ప్రసాదించింది. రూ. 25 లక్షల వరకూ ఖర్చయ్యే హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (గుండె మార్పిడి) చికిత్సను ప్రభుత్వం ఉచితంగా చేయించింది. దీంతో ఆ పేద కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: మనిషి ముఖాన్ని పోలిన డేంజర్ చేప..
కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం నరుకుల్లపాడు గ్రామానికి చెందిన 27 ఏళ్ల బుడ్డె రాంబాబు విజయవాడలోని ఓ ప్రైవేట్ సంస్థలో చిన్న ఉద్యోగం చేస్తాడు.గతేడాది జూన్‌లో రాంబాబు గుండెల్లో నొప్పిగా అనిపించి విజయవాడలోని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు పరీక్షలు చేసి గుండె 70 శాతం పనిచేయడం లేదని నిర్ధారించారు. గుండె మార్పిడి ఒక్కటే మార్గమని చెప్పి.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అయితే సదరు ప్రైవేట్ ఆస్పత్రిలో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి రూ. 25 లక్షల వరకూ ఖర్చు అవుతుందని చెప్పడంతో.. అంత ఆర్థిక స్తోమత లేని కుటుంబ సభ్యులు.. రాంబాబును ఇంటికి తీసుకువచ్చేశారు.
ఇది కూడా చదవండి: పూజారిగా మారి అమ్మవారి సేవలో ముస్లిం! కారణంఅయితే రాంబాబు ఆరోగ్య పరిస్థితి తెలిసిన గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు అతడికి సాయం చేయాలని భావించి.. రాంబాబు సమస్యను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. రాంబాబును ఆదుకుంటానని తెలిసిన వసంత కృష్ణప్రసాద్.. ఆరోగ్యశ్రీ అధికారులతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ అధికారులు రాంబాబును బెంగళూరులోని వైదేహీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి పంపించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి గుండెను ఈ నెల 10న వైద్యులు రాంబాబుకు అమర్చారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడి కుటుంబ సభ్యులు వైసీపీ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కి కృతజ్ఞతలు తెలిపారు. తమను ఆరోగ్యశ్రీ పథకం దేవుడిలా ఆదుకుందని.. సంతోషం వ్యక్తం చేశారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: దుర్భేద్యమైన జైలు నుంచి పారిపోయి.. మళ్లీ తనే తిరిగి వచ్చిన ఖైదీ!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.