మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని నెలలుగా కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. తాజాగా, కిడ్నీలో రాళ్లకు సంబంధించి శస్త్ర చికిత్స పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. రెండు వారాలపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కొడాలి నానికి సూచించినట్లు తెలుస్తోంది. 15 రోజుల తర్వాత అంతా బాగుందనుకుంటే ఆయనకు కిడ్నీ సంబంధిత లేజర్ చికిత్సను చేయనున్నట్లు సమాచారం.