గుంటూరు- గుంటూరు జిల్లా అమరావతి రోడ్డులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా.. మట్టి పెళ్లలు విరిగి పడ్డాయి. ఈ సంఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. వీరిద్దరూ బిహార్‌కు చెందిన వారిగా గుర్తించారు. మట్టి పెళ్లల కింద చిక్కుకుని వీర్దిదరు మృతి చెందినట్లు తెలిసింది. విషయం తెలిసిన వెంటనే సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు మట్టి పెళ్లల కింద చిక్కుకున్న మరో ముగ్గురిని సహాయక బృందాలు కాపాడాయి.
ఇది కూడా చదవండి: జోగిని శ్యామలకు వేధింపులు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు!
ఎస్వీ బిల్డర్స్ అండ్ అసోసియేట్స్ సంస్థ ఈ నిర్మాణ పనులు చేపట్టింది. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది. దుర్ఘటన నేపథ్యంలో ఎస్వీ బిడ్లర్స్ అండ్ అసోసియేట్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రంగం సిద్ధం అవుతోంది. దీనిపై మీ అభిప్రాయానలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: టీచర్ పనిష్‌మెంట్.. వాంతికి వస్తోందంటూ పోయింది.. అంతా షాక్!!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.