తిరుపతి జిల్లా రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. మృత్యువు అగ్నిప్రమాదం రూపంలో డాక్టర్ కుటుంబాన్ని వెంటాడింది. ఈ ఘటనలో వైద్యుడు, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఆస్పత్రి బిల్డింగ్‌లోనే వైద్యుడి కుటుంబం నివాసం ఉంటుంది. ఈ క్రమంలో హాస్పిటల్‌లో మంటలు చేలరేగడంతో.. ఆ భవనంలోనే నివాసం ఉంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుపోయింది. ఈ సంఘటనలో డాక్టర్‌తో పాటు ఆయన కుమార్తె, కుమారుడు మృతి చెందారు. ఈ దారుణ సంఘటన వివరాలు..
తిరుపతి, రేణిగుంట పట్టణం, భగత్‌సింగ్ కాలనీలో డాక్టర్ రవిశంకర్‌రెడ్డి కుటుంబం నివాసం ఉంటున్నారు. డాక్టర్‌కి అక్కడే కార్తికేయ అనే హస్పిటల్ ఉంది. ఈ బిల్డింగ్‌లోని పై అంతస్తులో రవిశంకర్ కుటుంబం నివాసం ఉంటుంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం రవిశంకర్ రెడ్డి ఇంట్లో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయి.. భవనంలోకి వెళ్లి.. రవిశంకర్ రెడ్డి భార్య, ఆయన అత్తను కాపాడారు. ఈ లోపు విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలం వద్దకు చేరుకుని.. రవిశంకర్ కుమారుడు భరత్(12), కుమార్తె కార్తిక(6)లను పై అంతస్తు నుంచి కిందకు దించారు.
అప్పటికే పిల్లలిద్దరూ తీవ్రంగా గాయపడటంతో వారిని.. తిరుపతిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇక ఘటనలో రవిశంకర్ రెడ్డి అగ్ని ప్రమాదంలో సజీవం దహనం కాగా.. చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మృతి చెందారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మరి ఈ దారుణ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.