ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేశారు. ఆడపడుచులకు, అన్నదాతలకు, ఆటోడ్రైర్లకు, నేతన్నలకు ఇలా వెనకబడిన ప్రతి వర్గాలను ఆర్థికంగా చేయూతనిస్తూ నేనున్నాను అంటూ అభయమిస్తున్నారు. వృద్ధులకు పెన్షన్లు, స్కూలు పిల్లలకు అమ్మఒడి పథకం ద్వారా చేయూతనిస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఓ పక్క మండుతున్న ఎండలు, దీనికి తోడు షార్ట్ సర్య్కూట్ తో కర్మాగారాల్లో అగ్రిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కర్మాగారాల్లో అగ్నిప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ పలుమార్లు హెచ్చరించినప్పటికి యాజమాన్యాలు పెడచెవిన పెడుతూ ప్రమాదాలభారిన పడుతున్నారు. నిన్న (బుదవారం)తిరుపతి జిల్లాలో ఓ బాణాసంచా కర్మాగారంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వరదయ్యపాలెం మండలం ఎల్లకటవ విలేజ్ లో బాణాసంచా గోడౌన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు సజీవ దహనం అయ్యారు.
అయితే ఈ ప్రమాద ఘటనై సిఎం స్పందించారు. బాణాసంచా గోడౌన్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతి చెందిన వారంతా పేద కుటుంబాలకు చెందిన వారని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారని తెలుసుకున్నారు సిఎం. దీంతో మరణించిన కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు తక్షణమే పరిహారాన్ని అందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.