ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేశారు. ఆడపడుచులకు, అన్నదాతలకు, ఆటోడ్రైర్లకు, నేతన్నలకు ఇలా వెనకబడిన ప్రతి వర్గాలను ఆర్థికంగా చేయూతనిస్తూ నేనున్నాను అంటూ అభయమిస్తున్నారు. వృద్ధులకు పెన్షన్లు, స్కూలు పిల్లలకు అమ్మఒడి పథకం ద్వారా చేయూతనిస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.