ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయినా ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచి ఎన్నికల కోసం భారీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన నేతలు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాక జనసేన తరపున సినీ రంగానికి చెందిన పలువురు పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తోన్నాయి. అలాంటి వారిలో హైపర్ ఆది పేరు బలంగా వినిపిస్తోంది. మొదటి నుంచి ఆది.. జనసేనకు మద్దతుగా ఉన్నాడు. అవకాశం వచ్చిన ప్రతిచోటా పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశాడు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన యువశక్తి సభలో అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. దీంతో హైపర్ ఆది సైతం వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్ధిగా పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. జనసేన అధినేత కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
హైపర్ ఆది.. బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తనదైన హాస్యం, కామెడీతో ప్రేక్షకులను ఓ రేంజ్ లో అలరిస్తున్నాడు. ఆది కోసమే చాలా మంది జబర్దస్త్ కామెడీ షో చూస్తారంటే అతిశయోక్తి కాదు. తనదైన మాటలతో, పంచ్ లతో హైపర్ ఆది ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ జీవితాన్ని ప్రారంభించిన ఆది.. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోకు డైలాగ్స్ రాస్తూ బుల్లితెరకు పరిచయమయ్యారు. అనంతరం అదిరే అభి టీమ్ లో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తానే స్వయంగా రాసుకొన్న డైలాగ్స్‌తో అందర్ని ఆకట్టుకొన్నారు. జబర్దస్త్ షోకే బ్రాండ్ అంబాసిడర్ అనేంత రేంజ్‌లో ఆది క్రేజ్ సంపాదించాడు. అంతేకాక పవన్ కల్యాణ్ అంటే హైపర్ ఆదికి ఎనలేని అభిమానం. అవకాశం దొరికినప్పుడల్లా పవన్ కల్యాణ్ పై తనకున్న అభిమానాన్ని ప్రదర్శించే వాడు.
ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన నిర్వహించిన యువశక్తి అనే సభలో కూడా ఆది పాల్గొన్నారు. అంతేకాక వేదిక పై నుంచి అదిరిపోయే స్పీచ్ ఇచ్చి జనసేన అధినేత దృష్టిలో పడ్డాడు. అధికార పార్టీ నేతలను, మంత్రులపై ఓ రేంజ్ లో విరుచక పడ్డాడు. అంతేకాక పవన్ కల్యాణ్ విజన్, జనసేన పార్టీని గెలిపిస్తే.. ఏం చేస్తారో సవివరంగా చెప్పారు. హైపర్ ఆది ప్రసంగాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే హైపర్ ఆది.. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్ధిగా పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హైపర్ ఆది పోటీ చేయడానికి జనసేన పార్టీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే హైపర్ ఆది.. తన సొంతజిల్లా అయినా ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
అందుకు కూడా ఓ బలమైన కారణం ఒకటి ఉంది. ఆది పుట్టిన ఊరు చీమకూర్తి.. దర్శి నియోజకవర్గంలో ఉంది. కాబట్టి సొంత ప్రాంతం నుంచి బరిలో నిలబడితే గట్టి పోటీ ఇవ్వొచ్చనే భావన ఉంది. అలానే హైపర్ ఆది పోటీ చేసే విషయంలో మరొక నియోజవర్గం పేరు కూడా వినిపిస్తోంది. అదే గిద్దలూరు నియోజకవర్గం. ఈ అసెంబ్లీ స్థానానికి ప్రత్యేకత ఉంది. 2009లో ప్రకాశం జిల్లాలో ప్రజారాజ్యం గెలిచిన ఏకైక స్థానం ఈ గిద్దలూరు. అందుకే ఈ స్థానం నుంచి హైపర్ ఆది వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి.. ఈవార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. మరి.. హైపర్ ఆది ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.