వినూత్న సంక్షేమ పథకాల అమలుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుంది ఆంధ్రప్రదేశ్. ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూనే.. మరోవైపు రాష్ట్రాన్ని సంక్షేమ పథంలో నడిపిస్తున్నారు సీఎం జగన్. రాష్ట్రంలో ఉపాధి కల్పనకు పెద్ద పీట వేస్తున్నారు సీఎం జగన్. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను తక్షణమే భర్తీ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 5,160 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. అధికారులను ఆదేశించారు. ప్రతి ఆర్‌బీకేలో పశు సంవర్థక శాఖ సహాయకుడిని నియమించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తాజాగా సీఎం జగన్.. పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఆర్బీకేలో ఒక పశుసంవర్ధక శాఖ సహాయకుడిని నియమించాలని ఆదేశించారు.
తద్వారా ఖాళీగా ఉన్న 5,160 ఖాళీలను భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దాదాపు 1200 మంది వెటర్నరీ డాక్టర్లుగా పట్టాలు పొంది ఖాళీగా ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ గ్రామంలో ఓ పశు వైద్యుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. మండల, జిల్లా, డివిజన్ స్థాయిలో ఇందుకు సంబంధించిన స్టాఫింగ్ ప్యాట్రన్ ఒకే విధంగా ఉండేలా రేషనలైజేషన్ చేయాలని సీఎం జగన్ ఆదేశారు జారీ చేశారు.