పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలిలో నిర్మాత బన్నీవాసుకి తృటిలో ప్రమాదం తప్పింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి నది పొంగి పొర్లుతోంది. పలు గ్రామాలు నీట మునిగాయి. వరద నీరు గ్రామాలను చుట్టు ముట్టటంతో ప్రభుత్వం సహాయక చర్యలను చేపట్టింది. ఈ క్రమంలో తమ వంతు సాయ అందించేందుకు వెళ్లిన బన్నీ వాసు అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నారు. వెంటనే.. అక్కడున్న వారు రక్షించడమంతో ఎలాంటి అపశృతి చోటుచేసుకోలేదు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరి నది పొంగి పొర్లుతోంది. పలు గ్రామాలు నీట మునిగాయి. సాయం కోసం ఎంతో మంది ఆర్జిస్తున్నారు. ఈ క్రమంలో యలమంచిలి నియోజకవర్గంలో బాడవ గ్రామంలో కొందరు వరదల్లో చిక్కుకున్నారన్న సమాచారం అందుకున్న ఆయన తనవంతు సాయం అందించేందుకు అక్కడకి వెళ్లారు. ఈ క్రమంలో ఒక గర్భిణిని రక్షించి పడవలో తీసుకొస్తుండగా ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దీంతో పడవ నీటిలో కొట్టుకోపోసాగింది. ఆ క్రమంలో పడవ కొబ్బరి చెట్టుకు తగిలి ఆగింది.
దీంతో పడవలోని వారంతా కంగారు పడటంతో పడవ విరిగి పోయింది. వెంటనే పడవ నడిపే వ్యక్తులు వారిని రక్షించారు. ఆ సమయంలో పడవలో పడవలో సినీ నిర్మాత బన్నీవాసు, గర్భిణీ, జనసేన నాయకులు ఉన్నారు. ప్రమాదం తప్పటంతో పడవలోని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన నుంచి భయపడ్డ అయన.. ప్రమాదం అంచున లంక గ్రామాల ప్రజలు ఉన్నారని.. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
పాలకొల్లు నియోజకవర్గం ఏనుగువాని లంక బాడవ వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన బన్నీ వాసు
Palakollu Bunny Vasu pic.twitter.com/aUNAfa8Ps3— Govardhan Reddy (@gova3555) July 17, 2022
ఇది కూడా చదవండి: Pawan Kalyan: జనసేన విలీనం.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే?
ఇది కూడా చదవండి: Roja Daughter: అరుదైన ఘనత సాధించిన మంత్రి రోజా కుమార్తె అన్షు మాలిక!