విష్ణువర్ధన్ అనే తొమ్మిదేళ్ల బాలుడు పక్కింటి కుర్రాడితో గొడవ పడ్డాడు. అలా ఎందుకు గొడవలు పడుతున్నావంటూ బాలుడి తల్లి మందలించింది. తల్లి అలా మందలించడం బాలుడికి నచ్చలేదు. తల్లి తిట్టిందని కోపం తెచ్చుకున్నాడు. శుక్రవారం స్కూల్ కు వెళ్తున్నానంటూ బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. తల్లికి కంగారు మొదలైంది. కొడుకు కోసం ఎదురుచూస్తూ ఉంది. కంగారు పడిన తల్లిదండ్రలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రశాంత్ నగర్ నుంచి నడుచుకంటూ గిరిపేట దుర్గమ్మ గుడి మీదుగా వెళ్లిన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. బాలుడి ఆచూకీ దొరకకపోవడంతో గీత తవణంపల్లె మండలం దిగువ తడకవరంలో నివసిస్తున్న తల్లిదండ్రులకు చెప్పింది. వారు కూడా చిత్తూరు చేరుకుని బాలుడి ఆచూకీ కోసం గాలింపు మొదలు పెట్టారు.
అయితే బాలుడు 18 కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లి దిగువ తడకవరంలోని అమ్మమ్మ వాళ్ల ఇంటికి చేరుకున్నాడు. అక్కడ బాలుడిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడిని సురక్షితంగా చిత్తూరు తీసుకెళ్లారు. విష్ణువర్ధన్ గతంలో బస్సులో దిగువ తడకవరం గ్రామానికి వెళ్లినప్పుడు కొన్ని గుర్తులు పెట్టుకుని ఇప్పుడు నడుచుకుంటూ వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులకు ఆ బాలుడిని సురక్షితంగా అప్పజెప్పారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.